సిరివెన్నెలకు చందనసీమ నివాళి

ABN , First Publish Date - 2021-12-01T16:58:41+05:30 IST

ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకస్మిక మృతి పట్ల చందనసీమ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ నివాళులు అర్పిస్తూ సీతారామశాస్త్రిని తెలుగు పాట

సిరివెన్నెలకు చందనసీమ నివాళి

బెంగళూరు: ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకస్మిక మృతి పట్ల చందనసీమ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ నివాళులు అర్పిస్తూ సీతారామశాస్త్రిని తెలుగు పాట ఉన్నంతవరకు ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకుంటారన్నారు. కర్ణాటక చలనచిత్రవాణిజ్యమండలి పదాధికారులు కూడా మంగళవారం నివాళులు అర్పించారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్‌ ఏ రాధాకృష్ణరాజు నివాళులు అర్పిస్తూ కొద్ది కాలం క్రితం సిరివెన్నెలను ఘనంగా సత్కరించుకున్నామని స్మరించుకున్నారు. పాటల రూపంలో సిరివెన్నెల సదా మన హృదయాలలో కొలువై ఉంటారన్నారు. డైలాగ్‌కింగ్‌ నటుడు సాయికుమార్‌, ప్రముఖ దర్శకుడు సాయిప్రకాశ్‌ కూడా సిరివెన్నెల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-01T16:58:41+05:30 IST