Hello Meera: సింగిల్ పాత్రతో.. బాపు శిష్యుడి చిత్రం

ABN , First Publish Date - 2022-10-07T04:19:20+05:30 IST

తొలి సినిమానే ప్రయోగాత్మక చిత్రంగా చేయడానికి ఘట్స్ కావాలి. ప్రముఖ దర్శకులు బాపు(Bapu)గారి పలు సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేసిన కాకర్ల శ్రీనివాసు (Kakarla Srinivas) ఇప్పుడటువంటి..

Hello Meera: సింగిల్ పాత్రతో.. బాపు శిష్యుడి చిత్రం

తొలి సినిమానే ప్రయోగాత్మక చిత్రంగా చేయడానికి ఘట్స్ కావాలి. ప్రముఖ దర్శకులు బాపు(Bapu)గారి పలు సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేసిన కాకర్ల శ్రీనివాసు (Kakarla Srinivas) ఇప్పుడటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. తొలి సినిమానే తనకు ఎంతో స్పెషల్ కావాలని.. ‘హలో మీరా’ (Hello Meera) కథపై కసరత్తులు చేసి.. ప్రేక్షకులు వినూత్న అనుభూతిని పొందేలా ఆవిష్కరించబోతున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించారు. కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమాను నడిపించి థ్రిల్ చేయనుండటం ఈ మూవీ ప్రత్యేకత. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్‌గా కథ మొత్తం కూడా మీరా అనే పాత్ర చుట్టూనే తిరుగుతూ.. ప్రేక్షకులకు అనుక్షణం సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుందని మేకర్స్ తెలుపుతున్నారు.     


ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రధాన పాత్ర అయిన మీరాను చూపిస్తూ కథలోని యాంగిల్ ఏంటనేది స్పష్టం చేశారు. మీరా వెనకాల కనిపిస్తున్న ప్రకాశం బ్యారేజ్, ఆకాశంలో పక్షులు ఎగురు తుండటం చూస్తుంటే ఈ సినిమాలో ఊహకందని సస్పెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ప్రయాణమే ఈ సినిమా అని.. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతినిస్తుందని దర్శకుడు కాకర్ల శ్రీనివాసు అంటున్నారు. తెరపై కనిపించే మీరాతోపాటు ఫోన్ కాల్స్‌లో వినిపించే  పాత్రలు మరింత ఉత్కంఠ రేపుతాయట. అతి త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ (Gargeyi Yellapragada) నటించారు. ఇంతకుముందు తమిళ్‌లో పార్థిబన్ ఇలా సింగిల్ పాత్రతో సినిమాని రూపొందించి అనేక అవార్డులు గెలుపొందిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-10-07T04:19:20+05:30 IST