Gowri Kalyana Vaibhogame: సింగర్స్‌తో సరికొత్త ప్రయోగం

ABN , First Publish Date - 2022-09-21T03:42:46+05:30 IST

గీతా మాధురి (Geetha Madhuri), సత్యయామిని (Satya Yamini), మనీషా (Manisha), సమీర భరద్వాజ్ (Sameer Bharadwaj), సాకేత్ (Saketh), అనుదీప్ (Anudeep).. ఈ సింగర్స్

Gowri Kalyana Vaibhogame: సింగర్స్‌తో సరికొత్త ప్రయోగం

గీతా మాధురి (Geetha Madhuri), సత్యయామిని (Satya Yamini), మనీషా (Manisha), సమీర భరద్వాజ్ (Sameera Bharadwaj), సాకేత్ (Saketh), అనుదీప్ (Anudeep).. ఈ సింగర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీరంతా వారి సింగింగ్ స్టైల్‌తో.. అభిమానులెందరినో సంపాదించుకున్నారు. ఇప్పుడు వీరంతా కలిసి ఓ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. వీరంతా కలిసి ఇప్పుడో పాటను పాడారు. సినిమా కోసం కొంత మంది సింగర్స్ కలిసి పాడటం.. ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు వీరంతా కలిసి ‘గౌరీ కళ్యాణ వైభోగమే’ (Gowri Kalyana Vaibhogame) అంటూ గొంతు కలిపారు. అయితే, ఇదేదో సినిమాకో, సీరియల్‌‌కో సంబంధించిన పాటని అనుకుంటే పొరబడినట్టే. ఒక ప్రముఖ టెక్స్‌టైల్ సంస్థ.. వారి కలెక్షన్స్‌ని ప్రమోట్ చేసే ప్రక్రియలో.. పై సింగర్స్ అంతా కలిసి ఈ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. వీరంతా కలిసి పాడిన పాట.. కొద్ది రోజుల్లోనే విశేష స్పందను రాబట్టుకోవడం విశేషం. 


‘గౌరీ కళ్యాణ వైభోగమే’ ట్యూన్‌తో.. సహజమైన సాహిత్యంతో అందరూ పాడుకునే విధంగా రూపుదిద్దుకున్న ఈ పాటని కేశవ కిరణ్ (Kesava Kiran) కంపోజ్ చేశారు. అలాగే మేకర్, లొకేషన్స్, ఎడిటింగ్, ఆర్ట్ ఇలా ప్రతి విభాగంలోనూ.. ఎంతో సహజత్వాన్ని కనబరుస్తూ ఈ పాటను దర్శకుడు విన్ను ముత్యాల (Vinnu Muthyala)చిత్రీకరించారు. సింగర్స్ అందరూ ఆ టెక్స్‌టైల్‌కి సంబంధించిన కాస్ట్యూమ్స్ ధరించి.. సరికొత్తగా కనిపించి ఈ పాటకి వన్నె తెచ్చారు. వారు ధరించిన కాస్ట్యూమ్స్ కూడా ఇప్పుడందరినీ ఆకర్షిస్తుండటం విశేషం. సంగీతాన్ని అభిమానించే వారంతా పాడుకునేలా ఈ పాట ఉండటమే కాకుండా.. ఇలా కాస్ట్యూమ్స్‌ని కూడా సింగర్స్ ప్రమోట్ చేయడమనే థాట్ సరికొత్తగా ఉందంటూ.. ఈ పాటకు కామెంట్స్ పడుతుండటం గమనార్హం.

Updated Date - 2022-09-21T03:42:46+05:30 IST