MUSIC ఓ కండోమ్‌లా మారిపోయింది... వాడుకుని, అవతల పడేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-11-06T23:24:08+05:30 IST

56 ఏళ్ల సీనియర్ సింగర్ హిందీ సినిమా సంగీతం కొత్తదనం లేక విలవిల్లాడుతోందని చెప్పారు. అందుకే, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్స్‌నే తీసుకుని రీమిక్స్ చేసి జనం మీదకి వదులుతున్నారని అన్నారు...

MUSIC ఓ కండోమ్‌లా మారిపోయింది... వాడుకుని, అవతల పడేస్తున్నారు!

సంగీతం ఇప్పుడు కండోమ్‌లా తయారైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సింగర్ పలాశ్ సేన్. ‘యుఫోరియా’ అనే రాక్‌బ్యాండ్ స్థాపించి ఎన్నో ఏళ్లుగా సరికొత్త పాప్ మ్యూజిక్ అందిస్తోన్న ఆయన తాజాగా బాలీవుడ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 56 ఏళ్ల సీనియర్ సింగర్ హిందీ సినిమా సంగీతం కొత్తదనం లేక విలవిల్లాడుతోందని చెప్పారు. అందుకే, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్స్‌నే తీసుకుని రీమిక్స్ చేసి జనం మీదకి వదులుతున్నారని అన్నారు. 


సినిమా పాటల్ని అడ్డూఅదుపు లేకుండా కమర్షియలైజ్ చేయటంపై మండిపడిన పలాశ్ సేన్, ‘‘ఎవరైనా సరే... అలా వెళతారు. కొనుక్కుంటారు. వాడుకుంటారు. అవతల పారేస్తారు. అసలు సంగీతం ఇలా వాడిపడేసే ఓ కండోమ్‌లా మారటానికి, మొత్తం వ్యవస్థ కారణమని, నేను భావిస్తున్నాను’’ అంటున్నారు. అంతే కాదు, ‘‘ఓ రేడియో స్పాట్, కొన్ని ఫేస్‌బుక్ యాడ్స్... కాసింత మీడియా స్పేస్... ఇవి కొనుక్కోగలిగితే ఎవరి పాటైనా బోలెడు మందికి చేరిపోతోందిప్పుడు. నిజానికి అలా ప్రచారం చేసుకోలేని వారి వద్ద, మంచి పాట ఉన్నా, అది చేరాల్సినంత మందికి చేరటం లేదు. ఇది చాలా పెద్ద ఆందోళనకర విషయం...’’ అని పలాశ్ తన ‘కండోమ్ కామెంట్’లోని అసలు ఉద్దేశాన్ని వివరించారు...    

Updated Date - 2021-11-06T23:24:08+05:30 IST