Engagement... 18 ఏళ్ల తరువాత మళ్లీ నిశ్చితార్థం!

ABN , First Publish Date - 2022-04-10T01:47:24+05:30 IST

అమెరికన్ గాయని, నటి జెన్నీఫర్ లోపెజ్ సరికొత్త పంథాలో జనం దృష్టిని ఆకర్షించింది. ఆమె రెండు సార్లు పెళ్లాడలేదు. రెండు సార్లు నిశ్చితార్థం మాత్రం చేసుకుంది. అందులో పెద్ద వింతేంటి అంటారా? 18 ఏళ్ల కిందట ఏ అందగాడి చేతనైతే ఉంగరం ధరింపజేసుకుందో... అతని చేతే ఇప్పుడు రెండోసారి రింగ్ తొడిగించుకుంది!

Engagement... 18 ఏళ్ల తరువాత మళ్లీ నిశ్చితార్థం!

సినిమా సెలబ్రిటీలు రెండు సార్లు, మూడు సార్లు పెళ్లాడటం మామూలు విషయమే. అందులోనూ హాలీవుడ్ తారలు పదేపదే వెడ్డింగ్ బెల్స్ మోగించటం... ఇంకా సర్వసాధారణం. కానీ, అమెరికన్ గాయని, నటి జెన్నీఫర్ లోపెజ్ సరికొత్త పంథాలో జనం దృష్టిని ఆకర్షించింది. ఆమె రెండు సార్లు పెళ్లాడలేదు. రెండు సార్లు నిశ్చితార్థం మాత్రం చేసుకుంది. అందులో పెద్ద వింతేంటి అంటారా? 18 ఏళ్ల కిందట ఏ అందగాడి చేతనైతే ఉంగరం ధరింపజేసుకుందో... అతని చేతే ఇప్పుడు రెండోసారి రింగ్ తొడిగించుకుంది!


నార్మల్‌గా అయితే, పెళ్లి చేసుకోటానికి ఒక్క ఎంగేజ్‌మెంట్ చాలు. హాలీవుడ్ యాక్టర్స్ జెన్నీఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ మాత్రం డబుల్ ఎంగేజ్‌మెంట్‌తో దంపతులు అయ్యేందుకు సిద్ధమయ్యారు. వారిద్దరు 18 ఏళ్ల కిందటే పీకల్లోతు ప్రేమలో పడ్డారు. అప్పట్లో బెన్ అండ్ జెన్నీఫర్ ప్రేమ జంటని మీడియా ‘బెన్నీఫర్’ అంటూ రొమాంటిక్‌గా పిలిచేది. కానీ, తీరా ఎంగేజ్‌మెంట్ చేసుకుని కొన్నాళ్లు కలసి డేటింగ్ గట్రా చేశాక... బెన్నీఫర్‌కు ఎక్కడో బెడిసికొట్టింది. జెన్నీఫర్, బెన్ అఫ్లెక్ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే... మే 2021 నుంచీ మాజీ లవ్వర్స్ మధ్య మళ్లీ అగ్గి రాజుకుంది!


ఒకప్పటి హై ప్రొఫైల్ హాలీవుడ్ లవ్ బర్డ్స్ రెండు దశాబ్దాల తరువాత గత కొన్ని నెలలుగా కలసి తిరుగుతున్నారు. దీన్ని మీడియా బోలెడు ప్రచారం కూడా చేసింది. అయితే, తమ రొమాన్స్‌కు సంబంధించిన వార్తలు, పుకార్లన్నీ నిజమేనంటూ జెన్నీఫర్ లోపెజ్ ఓ వీడియో రిలీజ్ చేసింది. తన వేలికున్న ఎంగేజ్‌మెంట్ రింగ్ చూస్తూ ఆమె ఎమోషనల్‌గా ఏడ్చేసింది. దాన్నే వీడియో రూపంలో తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది! 


మొదటిసారి వ్యవహారం ఫెయిలైయ్యాక సంవత్సరాల అనంతరం రెండోసారి మూడు ముళ్ల బంధం కోసం తహతహలాడుతోన్న జెన్నీఫర్, బెన్ అఫ్లెక్... పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో... చూడాలి! యంగ్ ఏజ్‌లో వర్కవుట్ కానీ ఎంగేజ్‌మెంట్... ఆమెకు 52, అతనికి 49 ఏళ్ల వయస్సులో... ఇప్పుడన్నా విజయవంతం కావాలని మనమైతే కోరుకుందాం! 

Updated Date - 2022-04-10T01:47:24+05:30 IST