ఒకరి తల్లిదండ్రులను మరొకరికి పరిచయం చేసిన సిద్దార్థ్ మల్హోత్రా, Kiara Advani

ABN , First Publish Date - 2021-12-24T21:10:39+05:30 IST

బాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ఈ సంవత్సరమే పెళ్లి, పెళ్లి అనే మాటలే ఎక్కువగా వినిపించాయి. ఈ ఏడాదే వరుణ్ ధవన్-నటషా దలాల్, రాజ్ కుమార్ రావ్- పత్రలేఖ

ఒకరి తల్లిదండ్రులను మరొకరికి పరిచయం చేసిన సిద్దార్థ్ మల్హోత్రా, Kiara Advani

బాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ఈ సంవత్సరం పెళ్లి, పెళ్లి అనే మాటలే ఎక్కువగా వినిపించాయి. ఈ ఏడాదే వరుణ్ ధావన్-నటషా దలాల్, రాజ్ కుమార్ రావ్- పత్రలేఖ, విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్నారు. రణ్ బీర్ కపూర్- ఆలియా భట్, సూరజ్ నంబియార్- మౌనిరాయ్ వచ్చే ఏడాది వివాహమాడనున్నారని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరి బాటలోనే నడుస్తూ మరో జంట పెళ్లి చేసుకొబోతున్నట్టు తెలుస్తోంది. వారెవరో కాదు సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అడ్వాణీ.. 


గత కొంతకాలంగా సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అడ్వాణీ డేటింగ్ చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ లాగానే ఈ జంట కూడా రిలేషన్‌షిప్‌ను  ప్రైవేటుగా కొనసాగిస్తోందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ఈ మధ్యనే వీరిద్దరూ ఒకరి తల్లిదండ్రులను మరొకరికి పరిచయం చేసినట్టు తెలుస్తోంది. ‘‘  సిద్దార్థ్ - కియారా డేటింగ్ చేస్తున్న మాట నిజమే. పెళ్లి మాత్రం ఎప్పుడు చేసుకుంటారో తెలియదు. కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ లవ్ స్టోరీ గురించి మనందరికి తెలుసు. కత్రినా- విక్కీ అందరిని ఏవిధంగా సర్‌ప్రైజ్ చేశారో చూశాం కదా. అదేవిధంగా సిద్దార్థ్- కియారా అందరిని సర్ ప్రైజ్ చేస్తారు ’’ అని సిద్దార్థ్ మల్హోత్రాతో సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి తెలిపారు. 

Updated Date - 2021-12-24T21:10:39+05:30 IST