సైనా నెహ్వాల్‌పై సిద్దార్థ్ ట్వీట్.. సోషల్ మీడియాలో పెను దుమారం..

ABN , First Publish Date - 2022-01-10T21:28:51+05:30 IST

బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్‌ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపుతోంది. జాతీయ మహిళా కమిషన్ సిద్దార్థ్‌కు నోటీసులు

సైనా నెహ్వాల్‌పై సిద్దార్థ్ ట్వీట్.. సోషల్ మీడియాలో పెను దుమారం..

బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్‌ దేశ వ్యాప్తంగా తీవ్ర  దుమారం లేపుతోంది. జాతీయ మహిళా కమిషన్ సిద్దార్థ్‌కు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఆ నటుడు చేసిన ట్వీట్ ఏంటీ.. ఆ ట్వీట్ లో ఏముంది..


గత వారంలో ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్‌లోని ఒక సభలో పాల్గొనాల్సి ఉంది. నిరసనకారులు మోదీ కాన్వాయ్‌ను ప్లైఓవర్‌పై దాదాపుగా 20నిమిషాలు అడ్డగించారు. దీంతో సభ రద్దయిపోయింది. సభలో పాల్గొనకుండానే ఆయన వెనుదిరిగాల్సి వచ్చింది. ఆ ఘటనను ఉద్దేశిస్తూ సైనా నెహ్వాల్ ఒక ట్వీట్ చేసింది. ‘‘  ప్రధాని మోదీకే  భద్రత లభించనప్పుడు మన దేశం సురక్షితమైనదని చెప్పలేం. ప్రధానిపై అరాచకవాదుల  పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను ’’ అని సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది. సైనా చేసిన ట్వీట్ ను సిద్దార్థ్ రీ ట్వీట్ చేశాడు. ‘‘కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్. థాంక్ గాడ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా..షేమ్ యూ రిహన్నా ’’ అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. సైనాను ‘‘కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ ’’ అనడంతో ఆ ట్వీట్‌పై దుమారం రేగింది. 


సిద్దార్థ్ చేసిన ట్వీట్‌ను పలువురు ప్రముఖులు ఖండించారు. శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది హీరో వ్యాఖ్యలను ఖండించారు. సింగర్ చిన్మయి శ్రీపాద కూడా సిద్దార్థ్‌కు వ్యతిరేకంగా గళమెత్తింది. ‘‘ సిద్దార్థ్ ఇది చాలా దారుణం. మీటూ ఉద్యమంలో అనేక మంది మహిళలకు మద్దతుగా మీరు మాట్లాడారు. కాక్ చాంఫియన్ ఆఫ్ ది వరల్డ్ అనే పదానికి మరో అర్థం ఉంది. సైనాను ఆ పదంతో సంబోధించడం అవమాన‌కరం ’’ అని చిన్మయి శ్రీపాద ట్వీట్ చేసింది. సైనాకు మద్దతుగా పారపల్లి కశ్యప్ కూడా ట్వీట్ చేశాడు. ‘‘ అభిప్రాయం చెప్పడం తప్పు కాదు. కానీ, చెప్పేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలి ’’ అని కశ్యప్ ట్వీట్ చేశాడు.


దీంతో జాతీయ మహిళా కమిషన్ సిద్దార్థ్‌కు నోటీసులు జారీ చేసింది. సిద్దార్థ్‌పై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఛైర్ పర్సన్ రేఖా శర్మ మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు లేఖ రాశారు. ట్వీట్ వివాదస్పదం కావడంతో సిద్దార్థ్ రిప్టై ఇచ్చాడు. ‘‘ కాక్, బుల్‌కు మీరు తేడా తెలుసుకోవాలి లేదంటే చదివేటప్పుడు తప్పులు దొర్లే అవకాశం ఉంది. ఎవరిని అవమానపరచాలనే ఉద్దేశం నాకు లేదు ’’ అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు.  





Updated Date - 2022-01-10T21:28:51+05:30 IST