హీరోగా ఎంట్రీ ఇస్తున్న సిద్ శ్రీరామ్ ..?

ABN , First Publish Date - 2022-01-07T21:52:25+05:30 IST

సంగీతానికి భాషతో సంబంధం లేదని నిరూపించారు సింగర్ సిద్ శ్రీరామ్. సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లో అతడు పాటలను పాడారు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న సిద్ శ్రీరామ్ ..?

సంగీతానికి భాషతో సంబంధం లేదని నిరూపించారు సింగర్ సిద్ శ్రీరామ్. సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లో అతడు పాటలను పాడారు. మెలోడియస్ గీతాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అల మైకుంఠపురంలో అతడు పాడిన ‘‘ సామజవరగమన’’ పాట ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే.


‘‘ కడల్’’ సినిమాతో సింగర్‌గా సిద్ శ్రీరామ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఏఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ‘‘ వానం కొట్టత్తుం ’’ సినిమాకు సిద్ శ్రీరామ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి మణిరత్నం నిర్మాతగా వ్యవహరించారు. ధనశేఖరన్ దర్శకత్వం వహించారు. మణిరత్నం సినిమాలతోనే సిద్ శ్రీరామ్ సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మణిరత్నం సినిమాతోనే సిద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టుకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. మణిరత్నం దర్శకత్వంలోనా లేదా అతడు నిర్మించబోయే చిత్రంతోనా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-01-07T21:52:25+05:30 IST