‘శ్యామ్ సింగ రాయ్’ సెకండ్ సింగిల్: నాని, కృతిశెట్టిల లిప్ లాక్ వైరల్

ABN , First Publish Date - 2021-11-26T00:53:11+05:30 IST

న్యాచులర్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోహీరోయిన్లుగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్

‘శ్యామ్ సింగ రాయ్’ సెకండ్ సింగిల్: నాని, కృతిశెట్టిల లిప్ లాక్ వైరల్

న్యాచులర్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోహీరోయిన్లుగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ‌పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్‌ను గురువారం చిత్రయూనిట్ విడుదల చేసింది.


‘ఏదో ఏదో’ అంటూ నాని, కృతిశెట్టిలపై రూపొందించిన ఈ మెలోడి సాంగ్‌కు మిక్కీ జే మేయర్ అందించిన స్వరాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు కృష్ణ కాంత్ సాహిత్యం అందించగా చైత్ర అంబడిపుడి ఆలపించారు. ఈ పాటలో నాని, కృతిశెట్టిల రొమాన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అలాగే ఈ పాటలో కృతిశెట్టి, నానిల మధ్య లిప్ లాక్ కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.



Updated Date - 2021-11-26T00:53:11+05:30 IST