‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2021-10-31T01:50:59+05:30 IST

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోహీరోయిన్లుగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో

‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోహీరోయిన్లుగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన వివరాలను తెలుపుతూ చిత్రయూనిట్ శనివారం ఓ ప్రోమోని విడుదల చేసింది.


‘రైజ్ ఆఫ్ శ్యామ్’ అంటూ విడుదల చేయనున్న ఈ లిరికల్ వీడియో సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. నవంబర్ 6న ఈ ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. శ్యామ్ పాత్రకు సంబంధించిన క్యారక్టరైజేషన్‌ని తెలియజేసేలా ఆ పాట సాగుతుంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో హీరో నాని కుర్చీలో కూర్చుని.. చేతిలో సిగరెట్ పట్టుకుని.. సీరియస్ లుక్కుతో కనిపిస్తున్నారు. సత్యదేవ్ జంగా కథతో వస్తోన్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ స్థాయిలో క్రిస్మస్ కానుకగా.. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Updated Date - 2021-10-31T01:50:59+05:30 IST