ప్రెస్ మీట్‌కి ముందు జరిగింది ఇదే.. ‘శ్యామ్ సింగరాయ్’ తొలగించిన సన్నివేశం 4

ABN , First Publish Date - 2022-01-30T01:36:09+05:30 IST

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రానికి సంబంధించి తొలగించిన సన్నివేశాలను చిత్రయూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన తొలగించబడిన 3 సన్నివేశాలు నెటిజన్లను ఆకట్టుకుంటుండగా.. తాజాగా మరో సన్నివేశాన్ని

ప్రెస్ మీట్‌కి ముందు జరిగింది ఇదే.. ‘శ్యామ్ సింగరాయ్’ తొలగించిన సన్నివేశం 4

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రానికి సంబంధించి తొలగించిన సన్నివేశాలను చిత్రయూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన తొలగించబడిన 3 సన్నివేశాలు నెటిజన్లను ఆకట్టుకుంటుండగా.. తాజాగా మరో సన్నివేశాన్ని మేకర్స్ శనివారం విడుదల చేశారు. ఈ భారీ సన్నివేశంలో డైరెక్టర్‌గా వాసుకి 3 బాలీవుడ్ అవకాశాలు వచ్చిన సన్నివేశాలను చూపించారు. సినిమాలో బాలీవుడ్ ప్రముఖ బ్యానర్‌లో వాసు మూడు సినిమాలను డైరెక్ట్ చేయబోతున్నట్లుగా ప్రకటించిన మరుక్షణమే అతనిని అరెస్ట్ చేస్తారు. అయితే అంతకుముందు ఏం జరిగిందీ అనేది ఈ తొలగించబడిన సన్నివేశంలో చూపించారు. ఈ సన్నివేశం బాగున్నా.. నిడివిని దృష్టిలో పెట్టుకునే సినిమా నుండి దీనిని తొలగించినట్లుగా తెలుస్తోంది.


నాని సరసన సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై‌ రాహుల్‌ సంకృత్యాన్ దర్శకత్వంలో.. వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. థియేటర్లలోనే కాకుండా తాజాగా ఓటీటీలో కూడా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ హనుమ విహారి వంటి వారెందరో ఈ చిత్రంపై ప్రశంసలు వర్షం కురిపించారు. కాగా, ప్రస్తుతం విడుదల చేసిన ఈ తొలగించిన సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Updated Date - 2022-01-30T01:36:09+05:30 IST