శ్యామ్ జ్ఞాపకాల్లోకి వాసు.. తొలగించిన మరో భారీ సన్నివేశం ఇదే!

ABN , First Publish Date - 2022-01-25T02:15:51+05:30 IST

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రానికి సంబంధించి తొలగించిన సన్నివేశాలను చిత్రయూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన తొలగించబడిన సన్నివేశం ఒకటి నెటిజన్లను ఆకట్టుకుంటుండగా.. తాజాగా మరో సన్నివేశాన్ని

శ్యామ్ జ్ఞాపకాల్లోకి వాసు.. తొలగించిన మరో భారీ సన్నివేశం ఇదే!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రానికి సంబంధించి తొలగించిన సన్నివేశాలను చిత్రయూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన తొలగించబడిన సన్నివేశం ఒకటి నెటిజన్లను ఆకట్టుకుంటుండగా.. తాజాగా మరో సన్నివేశాన్ని మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ భారీ సన్నివేశంలో శ్యామ్ జ్ఞాపకాల్లోకి వెళుతున్న వాసుని చూపించారు. ఇందులో డైలాగ్స్ ఏమీ లేవు కానీ.. రోశీ కోసం వాసు అవతారంలో ఉన్న శ్యామ్‌గా నాని అద్భుతమైన నటనను కనబరిచారు. ఇందులో కూడా వేశ్యలకు సంబంధించిన ఓ హార్ట్ టచింగ్ సన్నివేశాన్ని జోడించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సన్నివేశాన్ని హైలెట్ చేస్తోంది. ఇంతకుముందు విడుదల చేసిన సన్నివేశంలానే ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే నిడివి విషయంలో ఆలోచించి.. ఈ సన్నివేశాన్ని తొలగించినట్లుగా తెలుస్తోంది. 


నాని సరసన సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై‌ రాహుల్‌ సంకృత్యాన్ దర్శకత్వంలో.. వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. థియేటర్లలోనే కాకుండా తాజాగా ఓటీటీలో కూడా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ హనుమ విహారి వంటి వారెందరో ఈ చిత్రంపై ప్రశంసలు వర్షం కురిపించారు. కాగా, ప్రస్తుతం విడుదల చేసిన ఈ తొలగించిన భారీ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Updated Date - 2022-01-25T02:15:51+05:30 IST