Shweta Nanda: నా పిల్లలు నాలాగా కాకూడదు.. అమితాబ్ బచ్చన్ కూతురి వ్యాఖ్యలకు కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-09-26T17:10:34+05:30 IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మనవరాలు నవ్య నవేలి నందా (Shweta Nanda)కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే...

Shweta Nanda: నా పిల్లలు నాలాగా కాకూడదు.. అమితాబ్ బచ్చన్ కూతురి వ్యాఖ్యలకు కారణమేంటంటే..

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మనవరాలు నవ్య నవేలి నందా (Shweta Nanda)కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆమె ప్రస్తుతం ‘వాట్ ది హెల్ నవ్య’ అనే పోడ్‌కాస్ట్ చాట్ షో చేస్తోంది. దానికి ప్రమోషన్స్ కోసం ఆమె తల్లి, అమితాబ్ కూతురు శ్వేత నందా (Shweta Nanda).. అలాగే ఆమె అమ్మమ్మ, అమితాబ్ భార్య జయా బచ్చన్ (Jaya Bachchan) ఆ పోడ్ కాస్ట్‌లో మాట్లాడారు. అందులో.. పలు ఆసక్తికర, ఇప్పటివరకూ ఎక్కడ చెప్పని పలు విషయాలను పంచుకున్నారు. అందులో శ్వేతా నంద ఆర్థికంగా స్వాతంత్రంగా లేనట్లు చెప్పుకొచ్చింది. అయితే.. శ్వేత మోడల్‌గా, కాలమిస్ట్‌గా, రచయిత్రిగా, వ్యాపారవేత్తగా విజయవంతం అయ్యారు. కాబట్టి.. శ్వేత నుంచి ఇలాంటి మాటలను ఎవరూ ఊహించలేదు.


శ్వేత మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తూ.. నేను ఆర్థికంగా స్వాతంత్రంగా లేను. నేను ప్రత్యేకించి ప్రతిష్టాత్మక వ్యక్తిని కాదు. నేను స్వాతంత్ర్యంగా కొన్ని పనులు చేయలేను. కానీ నా పిల్లలు అలా ఉండాలని నేను కోరుకోవట్లేదు. అద్దె చెల్లించడానికి లేదా మీ సొంత ఇల్లు కొనటానికి.. వారి బ్యాంకులో తగినంత డబ్బు లేకపోతే వివాహం చేసుకోవద్దని చెబుతాను. వారు నాలాగా కాకుండా స్వాతంత్ర్యంగా బతకాలని కోరకుంటాను. నా కుమార్తెకు ఆర్థిక భద్రత ఉండాలని నేను కోరుకుంటున్నాను. తండ్రి డబ్బుకు ఉపయోగించుకోకుండా ఉంటే.. అది నవ్యకు విపరీతమైన విశ్వాసాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది.


కాగా.. నవ్య చేస్తున్న ఈ పోడ్ కాస్ట్ సెప్టెంబర్ 24న ప్రారంభమైంది. కొత్త ఎపిసోడ్ ప్రతి శనివారం విడుదల కానుంది. కాగా.. శ్వేత కొడుకు అగస్త్య ప్రస్తుతం జోయా అక్తర్ ‘ది ఆర్చీస్’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయం కానున్నాడు.

Updated Date - 2022-09-26T17:10:34+05:30 IST