ఆయనొక అద్భుతం: Shurthi Haasan
ABN , First Publish Date - 2022-06-30T15:09:36+05:30 IST
ఆయనొక అద్భుతం..అంటూ పొగడ్తలతో ముంచేసింది గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shurthi Haasan). తెలుగులో పవన్ కళ్యాణ్ (Pawa Kalyan)
ఆయనొక అద్భుతం..అంటూ పొగడ్తలతో ముంచేసింది గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shurthi Haasan). తెలుగులో పవన్ కళ్యాణ్ (Pawa Kalyan) హీరోగా వచ్చిన కాటమరాయుడు సినిమాలో నటించి ఫాప్ అందుకున్న శృతి హాసన్, ఆ తర్వాత దాదాపు మూడేళ్ళు అవకాశాలు లేక టాలీవుడ్‌కు దూరంగా ఉంది. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand malineni) కూడా మూడేళ్ళ నుంచి సక్సెస్ లేక కనిపించలేదు. మాస్ మహారాజ రవితేజ (Raviteja) వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ హిట్ ఆయన ఖాతాలో చేరలేదు. వీరు ముగ్గురు కలిసి మూడేళ్ళ గ్యాప్ తర్వాత క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్నారు.
దాంతో ముగ్గురూ కెరీర్ పరంగా చాలా బిజీ అయ్యారు. రవితేజ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలకృష్ణ (Balakrishna) హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక హీరోయిన్ శృతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ (Salaar) అనే పాన్ ఇండియా సినిమాను చేస్తుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ఇందులో హీరోగా నటిస్తున్న ప్రభాస్‌లపై శృతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల తాను ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఇందులో తనకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో ప్రశాంత్ నీల్ కూడా ఒకరని.. ఆయన సినిమాల్లోని కథ, కథనాలు ఎంతో బాగుంటాయని శృతి తెలిపింది. అలాగే, ప్రభాస్ గురించి చెప్తూ..ఆయనతో వర్క్ చేయడం నిజంగా ఎంతో బాగుందని, ముఖ్యంగా.. ఆయన గురించి ఒక్కమాటలో చెప్పాలి అంటే ఆయన ఒక అద్భుతం అని కొనియాడింది. కాగా, సలార్ సినిమాలో శృతి..ఆద్య అనే పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి సరసన మెగా 154, బాలకృష్ణ సరసన గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తుంది.