శ్రుతీ హసన్ వాడేసిన తన దుస్తుల్ని... తరువాత ఏం చేస్తుందంటే...

ABN , First Publish Date - 2022-04-16T22:39:20+05:30 IST

సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ తన ఫ్యాషన్ సెన్స్‌తో మంచి గుర్తింపు పొందింది గార్జియస్ బ్యూటీ శ్రుతీ హసన్. అయితే, 36 ఏళ్ల సీనియర్ సుందరి దుస్తుల విషయంలో తన ఆలోచనల్ని ఈ మధ్య మీడియాతో పంచుకుంది..

శ్రుతీ హసన్ వాడేసిన తన దుస్తుల్ని... తరువాత ఏం చేస్తుందంటే...

సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ తన ఫ్యాషన్ సెన్స్‌తో మంచి గుర్తింపు పొందింది గార్జియస్ బ్యూటీ శ్రుతీ హసన్. అయితే, 36 ఏళ్ల సీనియర్ సుందరి దుస్తుల విషయంలో తన ఆలోచనల్ని ఈ మధ్య మీడియాతో పంచుకుంది. సాధారణంగా స్టార్ హీరోయిన్స్ ఒకసారి వాడిన దుస్తుల్ని మళ్లీ ధరించేందుకు ఇష్టపడరు. తాను మాత్రం అలా కాదంటోంది శ్రుతీ. ఒకసారి ఉపయోగించిన వస్త్రాల్ని అప్పుడప్పుడూ రిపీట్ చేస్తుంటానని ఆమె చెప్పుకొచ్చింది. కాకపోతే, అంతకంటే ఆసక్తికరమైన విషయం మరొకటి కూడా చెప్పింది. శ్రుతీ ఒకసారి తాను ధరించిన దుస్తుల్ని తరువాత ఏం చేస్తుందంటే... 


ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజూ భారీ ఎత్తున వస్త్రాల ఉత్పత్తి జరుగుతుంటుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ, శ్రుతీ ఆ దుస్తుల తయారీ వెనుక దాగున్న మరో కోణాన్ని చర్చించింది. వస్త్రాలు ఉత్పత్తి చేసే క్రమంలో పరిశ్రమల్లో భారీగా నీటిని వాడతారు. అంటే, మనం వాడకుండా వృథాగా వదిలేస్తోన్న దుస్తుల కారణంగా ఎప్పటికప్పుడు నీరు కూడా పెద్ద మొత్తంలో వ్యయం అవుతోందన్నమాట. అందుకే, తాను వాడకుండా పక్కన పెట్టిన దుస్తుల్ని మళ్లీ అమ్మకానికి పెడుతుందట శ్రుతీ. అలా రీసేల్ చేయగా వచ్చిన డబ్బుల్ని సేవా కార్యక్రమాలకి అందిస్తుందట! గత క్రిస్మస్ సమయంలో తనకు ఎంతగానో ఇష్టమైన దుస్తుల్ని కూడా ఆమె అమ్మకానికి పెట్టిందట. తద్వారా వస్త్రాలు వృథా అవ్వకుండా చూడటమే కాకుండా చారిటీ కోసం ఫండ్స్ రైజ్ చేయగలిగానని లేడీ హసన్ చెప్పుకొచ్చింది!   

Updated Date - 2022-04-16T22:39:20+05:30 IST