దానికి నా దగ్గర సమాధానం లేదు: Shruti Haasan
ABN , First Publish Date - 2022-07-02T15:42:30+05:30 IST
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ (Shruti Haasan) మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న సంగతి తెలిసిందే.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ (Shruti Haasan) మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా.. మంచి పాపులారిటీ తెచ్చుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. కేవలం ఒక్క భాషకు పరిమితం అవ్వకుండా.. సౌత్‌లోని తెలుగు, తమిళం అలాగే హిందీలో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం శృతి హాసన్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నందమూరి బాలకృష్ణ (Balakrishna) సరసన హీరోయిన్‌గా మాస్ ఎంటర్‌టైనర్స్‌లో నటిస్తూనే, గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)కి జంటగా 'సలార్' (Salaar) వంటి పాన్ ఇండియా సినిమాలో కూడా నటిస్తోంది.
అంతేకాదు, మరోవైపు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ బిజీగా ఉంది. వరుసగా సినిమాలు ఫ్లాపయిన సందర్భాలు కూడా శృతి ఎదురుకుంది. అలాంటి సమయంలో కూడా తను చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంది తప్ప ఎప్పుడూ సహనం కోల్పోవడం కనిపించలేదు. ఇక ఇటీవల తనకు అనారోగ్య సమస్యలున్నాయని చెప్పి షాకిచ్చింది. తనకు హార్మోన్ లోపం ఉందని, దీని కారణంగా ఇబ్బంది పడుతున్నట్లుగా శృతి హాసన్ చెప్పుకొచ్చింది. 'ప్రస్తుతం నేను పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. ఎండోమెట్రియోసిస్ వంటి పలు హార్మోన్ సమస్యలను ఎదుర్కొంటున్నాను. వాటి వల్ల జీవక్రియ సరిగా ఉండక పోవడంతో పాటు ఉబ్బరంగా ఉంటుంది'.. అని తెలుపుతూ ఇన్స్టాలో ఓ వీడియోను పెట్టింది.
ఇదిలా ఉంటే..ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు శృతి హాసన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పెళ్లి గురించి సదరు జర్నలిస్ట్ ప్రస్తావిస్తూ, 'ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడు'..? అని అడిగారు. ఆ ప్రశ్నకు శృతి స్పందిస్తూ.. 'దానికి నా దగ్గర సమాధానం లేదు'.. అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చింది. ఇక తాను కొన్నాళ్లుగా ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, శృతి పెళ్లి గురించి గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శృతి తన పెళ్లి గురించి ఇచ్చిన ఈ సమాధానంతో క్లారిటీ వచ్చింది.