బాయ్‌ఫ్రెండ్‌తో Shruti Haasan దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటో వైరల్!

ABN , First Publish Date - 2021-11-05T17:50:34+05:30 IST

విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన శ్రుతీహాసన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది.

బాయ్‌ఫ్రెండ్‌తో Shruti Haasan దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటో వైరల్!

విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన శ్రుతీహాసన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అగ్ర హీరోలందరి సరసనా నటించింది. ఇప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగానే ఉంది. లండన్ గాయకుడు మైకేల్ కోర్సలే నుంచి విడిపోయిన తర్వాత ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాకు శ్రుతి దగ్గరైంది. వీరిద్దరూ బహిరంగంగానే కలిసి తిరుగుతున్నారు. 


వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఇప్పటివరకు స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో శ్రుతి పోస్ట్ చేస్తున్న ఫొటోలు వారిద్దరి మధ్య బంధాన్ని చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా దీపావళి సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రుతి పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫొటోలో శ్రుతి, శాంతను కౌగిలించుకుని ఉన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి  శ్రుతి, శాంతను కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. `మా పరిపూర్ణ దీపావళికి సంబంధించిన అసంపూర్ణ ఫొటో.. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు` అని శ్రుతి కామెంట్ చేసింది. 

Updated Date - 2021-11-05T17:50:34+05:30 IST