పెళ్ళంటేనే భయమేస్తోంది : Shruthi Haasan

ABN , First Publish Date - 2022-06-06T17:20:03+05:30 IST

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) పెద్ద కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఆ తర్వాత తన వ్యక్తిగత టాలెంట్‌తో ఉన్నతస్థాయికి చేరుకుంది అందాల శ్రుతి హాసన్. సంగీత దర్శకురాలిగా, కథానాయికగా, సింగర్‌గా.. ఇలా ఒకటేమిటి అన్నిరంగాల్లోనూ ఆమెకు మంచి ప్రవేశముంది. ఇటు ఆకర్షించే అందం, అటు ఆకట్టుకొనే అభినయం మెండుగా, నిండుగా కలిగిన నటీమణి శ్రుతి.

పెళ్ళంటేనే భయమేస్తోంది  :  Shruthi Haasan

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) పెద్ద కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి,  ఆ తర్వాత తన వ్యక్తిగత టాలెంట్‌తో ఉన్నతస్థాయికి చేరుకుంది అందాల శ్రుతి హాసన్. సంగీత దర్శకురాలిగా, కథానాయికగా, సింగర్‌గా.. ఇలా ఒకటేమిటి అన్నిరంగాల్లోనూ ఆమెకు మంచి ప్రవేశముంది. ఇటు ఆకర్షించే అందం, అటు ఆకట్టుకొనే అభినయం మెండుగా, నిండుగా కలిగిన నటీమణి శ్రుతి. బిఫోర్ లాస్టియర్ ‘క్రాక్’ (Krack), గతేడాది ‘వకీల్‌సాబ్’ (Vakeelsaab)చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న శ్రుతి ఈ ఏడాది ఏకంగా మూడు పెద్ద సినిమాల్ని లైన్‌లో పెట్టుకుంది. ‌గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సీనియర్ స్టార్ హీరో సరసన కథానాయికగా నటిస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాబీ (Bobby) కలయికలో తెరకెక్కుతోన్న ‘వాల్తేరు వీరయ్య’ (waltair Veerayya) చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘సలార్’ లోనూ అమ్మడు కథానాయికగా నటిస్తోంది. 


ప్రస్తుతం శాంతను హజారికా (Shanthanu Hajarika) తో కలిసి సహజీవనం చేస్తోంది శ్రుతి హాసన్ . ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘పెళ్ళంటేనే భయమేస్తోంది. నా తల్లిదండ్రుల పెళ్ళి విడాకులకు దారితీసిందని నేను ఈ మాట చెప్పడం లేదు. కానీ, నాలో పెళ్లి అంటే అదోరకమైన భయం ఏర్పడుతోంది. వివాహం అంటే ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ లోలోపల భయం మాత్రం ఉంది. పైగా శాంతను నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక విషయాల్లో మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి’ అని వివరించింది. ప్రస్తుతం శ్రుతి స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి రకరకాలుగా నెటిజెన్స్ స్పందిస్తున్నారు. మరి పెళ్ళి చేసుకోకుండా శ్రుతి ఎంతకాలం శాంతనుతో సహజీవనం చేస్తుందో అని చర్చించుకుంటున్నారు.  

Updated Date - 2022-06-06T17:20:03+05:30 IST