బాయ్‌ఫ్రెండ్‌తో బాలీవుడ్ టాప్ హీరోయిన్ బ్రేకప్.. నాలుగేళ్ల బంధానికి..

ABN , First Publish Date - 2022-03-25T16:38:31+05:30 IST

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్‌లో శ్రద్ధా కపూర్ ఒకరు. మొదటి సినిమా నుంచే అందంతోపాటు నటనతోనూ ఎంతోమంది అభిమానుల..

బాయ్‌ఫ్రెండ్‌తో బాలీవుడ్ టాప్ హీరోయిన్ బ్రేకప్.. నాలుగేళ్ల బంధానికి..

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్‌లో శ్రద్ధా కపూర్ ఒకరు. మొదటి సినిమా నుంచే అందంతోపాటు నటనతోనూ ఎంతోమంది అభిమానుల మనసులు దోచుకుంది. ఈ బ్యూటీ గురించి తాజాగా నెట్టింట ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అదే తన బాయ్‌ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠ‌తో నాలుగేళ్ల బంధానికి శ్రద్ధా బ్రేకప్ చెప్పిందని.


అయితే వారి బ్రేకప్‌కి కారణం ఏంటని తెలియదు. వారిద్దరిలో ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. అయితే గోవాలో ఇటీవలే జరిగిన శ్రద్ధా పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కి రోహన్ రాకపోవడం ఈ ప్రచారానికి ఊతమిచ్చినట్లైంది. నిజానికి వీరి బంధంలో ఈ ఏడాది జనవరిలోనే తేడాలు రాగా.. ఫిబ్రవరిలో పూర్తిగా విడిపోయినట్లు సమాచారం. నిజానికి శ్రద్ధా, రోహన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పలేదు. కానీ చాలాసార్లు ఇద్దరూ కలిసి బయట కనిపించారు. దీంతో చాలాసార్లు త్వరలో వారు పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నట్లు వార్తలు సైతం వచ్చాయి.

Updated Date - 2022-03-25T16:38:31+05:30 IST