Mega Heroes: షూటింగ్స్‌కి బ్రేక్ ఎఫెక్ట్.. మెగా హీరోలే ఎందుకు ఫేస్ చేయాలి?

ABN , First Publish Date - 2022-07-29T02:14:47+05:30 IST

టాలీవుడ్‌లో సంక్షోభానికి దారి తీస్తున్న పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి, ముందస్తు జాగ్రతలు తీసుకోవడానికి గిల్డ్ అసోసియేషన్... ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించారు. షూటింగ్స్‌కి బ్రేక్ పడితే..

Mega Heroes: షూటింగ్స్‌కి బ్రేక్ ఎఫెక్ట్.. మెగా హీరోలే ఎందుకు ఫేస్ చేయాలి?

టాలీవుడ్‌లో సంక్షోభానికి దారి తీస్తున్న పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి, ముందస్తు జాగ్రతలు తీసుకోవడానికి గిల్డ్ అసోసియేషన్... ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించారు. షూటింగ్స్‌కి బ్రేక్ పడితే.. ఈ ఎఫెక్ట్ ఇండస్ట్రీలోని ప్రతి హీరోపై, ప్రతి సినిమాపై, ప్రతి టెక్నీషియన్‌పై పడనుంది. అయితే అందరి కన్నా ఎక్కువగా ఈ షూటింగ్స్ బ్రేక్ ఎఫెక్ట్ మెగా హీరోల పైనే ఎక్కువగా ఉంది. ఈ బ్రేక్‌లో మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) నటిస్తున్న అన్ని సినిమాలు.. ‘చిరు 154’, ‘భోళాశంకర్’, లూసిఫర్ రీమేక్ ‘గాడ్‌ఫాదర్’లకి బ్రేక్ పడనుంది. ఇందులో ఒక సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్ళగా, ఇంకొకటి రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుపుకుంటుంది. ‘గాడ్‌ఫాదర్’ సినిమా దసరా టార్గెట్‌గా చిత్రీకరణ జరుపుకుంటుంది కానీ.. ఈ సడన్ డెసిషన్, ఆ సినిమా రిలీజ్‌ని కూడా అయోమయంలో పడేసింది.


చిరు తర్వాత  ఈ ఎఫెక్ట్ పడే మరో మెగా హీరో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PowerStar Pawan Kalyan). పీరియాడిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’.. ఇంకొకటి ‘వినోదయ చిత్తం’ రీమేక్ సినిమా. దసరా తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి పాలిటిక్స్‌పై దృష్టి పెడుతూ సినిమాలకి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ లోపే కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడు కానీ.. అంతలోనే గిల్డ్ షూటింగ్స్‌కి బ్రేక్ వేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో పవన్ సినిమాల పరిస్థితి ఏంటో ఎవరికీ అర్ధం కావట్లేదు. 


ఈ బ్రేక్ వల్ల ఎఫెక్ట్ అయిన మరో మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)... ‘ట్రిపుల్ ఆర్’ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ, శంకర్‌తో సినిమా చేస్తున్న చరణ్.. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా చేస్తున్నాడు. తాజా పరిణామం చరణ్ స్పీడ్‌కి, సడన్ బ్రేక్ వేసినట్లు అయ్యింది. ఇక దాదాపు ఇదే రేంజులో ఎఫెక్ట్ అయిన హీరో అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప సినిమాతో పాన్ ఇండియాని షేక్ చేసిన బన్నీ... ‘పుష్ప 2’ని ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి తీసుకోని వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు కానీ, ఉన్నపళంగా బ్రేక్ అనే సరికి... ‘పుష్ప 2’ షూటింగ్ డైలమాలో పడింది. సోలో హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ (Varun Tej) కూడా తన  సినిమా షూటింగ్ ఆపేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఓవరాల్‌గా మెగా ఫ్యామిలీ నుంచే... దాదాపు 8 సినిమాలు ఈ బ్రేక్ ఎఫెక్ట్‌కి గురికానున్నాయి. ఈ డిలే ఎఫెక్ట్ రిలీజ్ డేట్స్ పైన కూడా పడనుంది. మళ్ళీ షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో.. ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో అనేది చూడాలి. ఈలోపు సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కారం అయితే మాత్రం.. ముందు సంతోషపడేది కూడా మెగా ఫ్యామిలీ హీరోలే (Mega Family Heroes). 

Updated Date - 2022-07-29T02:14:47+05:30 IST