ఫుల్‌లెంగ్త్‌ కామెడీగా ‘షూటింగ్‌ స్టార్‌’

ABN , First Publish Date - 2022-05-15T20:59:40+05:30 IST

శ్రీనిధి ఆర్ట్స్‌ బ్యానరులో ఎం.జె.రమణన్‌ (Mj ramanan) దర్శకత్వంలో దుష్యంత్‌ (Dushyanth), వివేక్‌ ప్రసన్న (Vivek Prasanna) నటించే తమిళ చిత్రం ‘షూటింగ్‌ స్టార్‌’ (shooting star) పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.

ఫుల్‌లెంగ్త్‌ కామెడీగా ‘షూటింగ్‌ స్టార్‌’

శ్రీనిధి ఆర్ట్స్‌ బ్యానరులో ఎం.జె.రమణన్‌ (Mj ramanan) దర్శకత్వంలో దుష్యంత్‌ (Dushyanth), వివేక్‌ ప్రసన్న (Vivek Prasanna) నటించే తమిళ చిత్రం ‘షూటింగ్‌ స్టార్‌’ (shooting star) పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. స్థానిక వలసరవాక్కంలో జరిగిన ఈ సినిమా ప్రారంభపూజలో బడా నిర్మాత కలైపులి ఎస్‌.థాను (Kalaipuli s thanu), సినీ నటి ఖుష్బూ, దర్శక, నిర్మాత, హీరో ఆర్‌.పార్తీబన్‌లతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు, చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఎంజె.రమణన్‌, జానీ దుగల్‌, వినంబర శాస్త్రిలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో దుష్యంత్‌, వివేక్‌ ప్రసన్నతో పాటు టాలీవుడ్‌ నటుడు శ్రీనివాస రెడ్డి, హిందీ నటుడు రవి కిషన్‌, మసుం శంకర్‌ కీలక పాత్రలను పోషిస్తున్నారు. 


జీవితంలో పలుమార్లు మోసపోయిన ఓ వ్యక్తిని, ఆయన చుట్టూ ఉన్నవారు కూడా ఏ విధంగా మోసం చేసి, జోకర్‌ (joker)ను చేశారన్న అంశాన్ని ఎంతో ఫన్నీగా, హస్య భరితంగా తెరకెక్కించనున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందించనున్నట్టు తెలిపారు. జూన్‌ నుంచి సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ చిత్రం షూటింగ్‌ను చెన్నై, ముంబై, హైదరాబాద్‌, ఖజురహోలలో జరుపనున్నట్టు దర్శకుడు ఎం.జె.రమణన్‌ (Mj ramanan)  తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా ఎస్‌.ఆర్‌.సతీష్‌ కుమార్‌, ఆర్ట్స్‌ చేతన్‌ పాథక్‌, కూర్పు శశికుమార్‌, సంగీతం అజ్మద్‌-నదీమ్‌-ఆమీర్‌. 

Updated Date - 2022-05-15T20:59:40+05:30 IST