Sobhita Dhulipala: భావోద్వేగాలతో సాగే బరువైన పాత్ర ఇది!

ABN , First Publish Date - 2022-05-22T00:12:00+05:30 IST

‘‘నా కెరీర్‌లో కన్నీళ్ళ కోసం ఎప్పుడూ గ్లిజరిన్‌ వాడలేదు. ‘మేజర్‌’లాంటి కథను అనుభవించిన తర్వాత జీవితంలో నాకు గ్లిజరిన్‌ అవసరం ఉండదనిపించింది. భయం, ఏడుపు, ధైర్యం, నమ్మకం, ఆశ, నిరాశ.. ఇలా నా పాత్రలో చాలా కోణాలు కనిపిస్తాయి. భావోద్వేగాలతో సాగే బరువైన పాత్ర ఇది. ఇలాంటి పాత్రలకు రిఫరెన్స్‌ వుండదు. ఇది యదార్థంగా జరిగిన కథ, ఒకరు అనుభవించిన బాధ కాబట్టి వారికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాటిక్‌గా కాకుండా బాధ్యతతో మనసు పెట్టి ఈ పాత్ర చేశా’’ అని శోభితా ధూళిపాల అన్నారు.

Sobhita Dhulipala: భావోద్వేగాలతో సాగే బరువైన పాత్ర ఇది!

‘‘నా కెరీర్‌లో కన్నీళ్ళ కోసం ఎప్పుడూ గ్లిజరిన్‌ వాడలేదు. ‘మేజర్‌’(Major)లాంటి కథను అనుభవించిన తర్వాత జీవితంలో నాకు గ్లిజరిన్‌ అవసరం ఉండదనిపించింది. భయం, ఏడుపు, ధైర్యం, నమ్మకం, ఆశ, నిరాశ.. ఇలా నా పాత్రలో చాలా కోణాలు కనిపిస్తాయి. భావోద్వేగాలతో సాగే బరువైన పాత్ర ఇది. ఇలాంటి పాత్రలకు రిఫరెన్స్‌ వుండదు. ఇది యదార్థంగా జరిగిన కథ, ఒకరు అనుభవించిన బాధ కాబట్టి వారికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాటిక్‌గా కాకుండా బాధ్యతతో మనసు పెట్టి ఈ పాత్ర చేశా’’ అని శోభితా ధూళిపాల (Sobhita Dhulipala)అన్నారు. మేజర్‌ సందీప్‌ ఉన్ని కిషన్‌ జీవిత కథ ఆధారంగా శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన  చిత్రం ‘మేజర్‌’. మహేశ్‌బాబు (Mahesh babu) జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా భారీగా నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 3న ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులో కీలక పాత్ర పోషించిన శోభిత శనివారం విలేకర్లతో మాట్లాడారు. 


‘గూడచారి’ సినిమా చేస్తున్నపుడే మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ అంటే శేష్‌లో ఆరాధనా భావం చూశాను. ఆయన జీవితంలో చాలాకాలంగా రీసెర్చ్‌ చేస్తున్నారు. ‘గూడచారి’ షూటింగ్‌లో సందీప్‌ జీవితం గురించి ఆసక్తికరమైన సంగతులు ,నాతో పంచుకున్నారు. అయితే ఈ కథలో నేనూ ఓ భాగమని అప్పుడు నాకు తెలీదు. ఈ చిత్రానికి నేనే మొదటి ఆడియన్‌ని. 


భావోద్వేగాలతో సాగే బరువైన పాత్ర..

‘మేజర్‌’లో ప్రమోద అనే  పాత్రలో కనిపిస్తా. సినిమాలో ఒక పక్క సందీప్‌ జీవితం చూపిస్తూ.. మరో పక్క  26/11 దాడులు, తాజ్‌ హోటల్‌ ఘటన సమాంతరంగా చూపిస్తారు. నేను 26/11 ఎటాక్స్‌లో బందీగా కనిపిస్తా. భయం, ఏడుపు, ధైర్యం, నమ్మకం, ఆశ, నిరాశ .. ఇలా నా పాత్రలో చాలా కోణాలు కనిపిస?్తయి. భావోద్వేగాలతో సాగే బరువైన పాత్ర ఇది. ఇలాంటి పాత్రలకు రిఫరెన్స్‌ వుండదు. ఇది యదార్థంగా జరిగిన కథ కాబట్టి ఇలాంటి పాత్రల విషయంలో నేను ఒకటే నమ్ముతా. నేను పోషించిన పాత్ర బాధను ఒకరు అనుభవించారు. ఆ ఘటన తర్వాత వారి జీవితం  పూర్తిగా మారిపోయింది. వారికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాటిక్‌గా కాకుండా బాధ్యతతో మనసు పెట్టి ఈ పాత్ర చేశా. నా కెరీర్‌లో కన్నీళ్ళ కోసం ఎప్పుడూ గ్లిజరిన్‌ వాడలేదు. ఈ కథని అనుభవించిన తర్వాత జీవితంలో నాకు గ్లిజరిన్‌ అవసరం వుండదు.

కరోనా వల్లే గ్యాప్‌..

తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలనుంది. ‘గూడచారి’ తర్వాత ఇంత గ్యాప్‌ రావడానికి కరోనానే కారణం. లాక్‌డౌన్‌ లేకపోతే ‘మేజర్‌’ ఏడాది క్రితమే వచ్చేది. ఇతర భాషల్లో ‘కురుప్‌’, మణిరత్నం గారి ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చేస్తున్నా.  చుట్టు పక్కల అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నా. కానీ తెలుగులోనే కుదరలేదు. రానున్న రోజుల్లో తెలుగులో మంచి సినిమాలు నా నుంచి ఆశించవచ్చు. (Sobhita Dhulipala)


కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ చాలా ఉన్నాయి...

ఆర్మీ కథలు యుద్థం, లేదా ఒక సంఘటన మీద వుంటాయి. అయితే మేజర్‌ సందీప్‌ పర్సనల్‌గా చాలా కలర్‌ ఫుల్‌ఫిల్మ్‌. అమ్మాయిలందరికీ అతనంటే క్రష్‌ వుండేది. ఆయనకు సినిమాలంటే ఇష్టం. సందీప్‌ లైఫ్‌లో చాలా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్నాయి. తన దగ్గరున్న డబ్బు స్నేహితులకు ఇచ్చేసి రెండురోజులు ఆకలితో రైలు ప్రయాణం చేసిన వ్యక్తి సందీప్‌. ఇలాంటి కమర్షియల్‌ హీరోయిజం సన్నివేశాలు సందీప్‌ పర్సనల్‌ లైఫ్‌లో చాలా వున్నాయి. సినిమాకు అవి అడ్డువస్తాయేమో అని కట్‌ చేయాల్సివచ్చింది. మేజర్‌ సందీప్‌ ఎలా బ్రతికారు, ఎంత ధైర్యంగా నిలబడ్డారనేది ఈ చిత్రంలో చూస్తారు. ఎంత కష్టం వచ్చినా కూడా ధైర్యమైన మార్గాన్ని ఎంచుకునే సామర్థ్యం అందరిలోనూ వుందనే విషయాన్నీ మేజర్‌ సినిమా చూసిన ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. అడివి శేష్‌ ఈ కథ కోసం చాలా కష్టపడ్డాడు. మేజర్‌ సందీప్‌ తల్లితండ్రులకు ఈ కథ చాలా సున్నితమైన అంశం. వారు సినిమా చూసి గర్వపడాలనే ఉద్దేశంతో శేష్‌ చాలా కష్టపడ్డాడు. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా మేజర్‌. 

మహేష్‌ బ్యాక్‌బోన్‌...

మహేష్‌ బాబుగారు నిర్మాతగా ఈ సినిమాలో భాగం కావడం మా అదృష్టం. తన జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో మొదటిసారి బయట సినిమా చేశారు. ఇది మాలో గొప్ప ఎనర్జీ నింపింది. కరోనా వల్ల ఈ చిత్రం ఓటీటీకి వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాం. కానీ మహేష్‌ బ్యాక్‌ బోన్‌ గా నిలిచారు. ‘ఇది థియేటర్‌ సినిమా.. ఎట్టి పరిస్థితిలో థియేటర్‌ లోనే విడుదలౌతుందని చెప్పారు. 

కూల్‌ డైరెక్టర్‌...

దర్శకుడు శశి కిరణ్‌  చాలా కూల్‌. ఏదైనా కూల్‌గా ఆలోచిస్తారు. ఆయనకు ఆయనపై నమ్మకం ఎక్కువ. అలాగే చాలా ఎమోషనల్‌ కూడా. అదే ఎమోషన్‌తోనే ఈ సినిమా తీశారు. శశి హార్ట్‌ బీట్‌ ఆఫ్‌ థిస్‌ స్టొరీ.

అందరినీ మెప్పించే పాత్రలు చేయగలను...

నాకు  చారిత్రాత్మక కథల్లో నటించాలనుంది. ‘పొన్నియన్‌ సెల్వన్‌’తో ఆ ఆకాంక్ష కొంత వరకూ తీరింది. నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ని. మొదటిసారి అందులో డ్యాన్స్‌ ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఇప్పటి వరకూ సీరియస్‌ పాత్రలే చేసిన నాకు హ్యాపీగా ఉండే పాత్రలు చేయాలని వుంది. మొదట్లో పాత్రలు ఎంచుకునే అవకాశం వుండేది కాదు. వచ్చిన  వాటిలో మంచిదేదో ఎంచుకొని చేశాను. ఐతే ఇప్పుడు అన్నీ రకాల పాత్రలు చేసి మెప్పిస్తాననే నమ్మకం కలిగింది. (Major)

Updated Date - 2022-05-22T00:12:00+05:30 IST