Mega Star Chiranjeevi: చిరంజీవి మీద ఎందుకు అంత నెగెటివ్ ప్రచారం?

Twitter IconWatsapp IconFacebook Icon
Mega Star Chiranjeevi: చిరంజీవి మీద ఎందుకు అంత నెగెటివ్ ప్రచారం?

చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'గాడ్ ఫాదర్' (God Father) సినిమా ఈ దసరా పండగకు విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రీ-రిలీస్ (Pre-release) వేడుక ఈమధ్యనే అనంతపూర్ (Anantapur) లో జరిపారు. ఎవరూ వూహించనంత మంది అభిమానులు ఈ సభకు రావటం, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అభిమానులు చెక్కు చెదరకుండా అన్ని గంటలసేపు వుండటం చూసి చిరంజీవి చాలా భావోద్వేగానికి గురి అయ్యారు. అందుకే చిరంజీవి కూడా వర్షం లో తడుస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈమధ్య కాలం లో అంతమంది జనాలు ఒక సినిమా ఈవెంట్ కి రావటం బహుశా ఇదేనేమో అని చిత్రపరిశ్రమలో చెప్పుకుంటున్నారు. చిరంజీవి చాలా పాజిటివ్ గా ఆలోచిస్తూ వెళుతుంటే, కొంతమంది చిరంజీవి మీద నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. పరిశ్రమలో వున్నవాళ్లే పనిగట్టుకొని ఈ ప్రచారం చేస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది. 'గాడ్ ఫాదర్' హిట్ అయితే పరిశ్రమకే కాదు, పరిశ్రమలో వుంటున్న వందలాది కుటుంబాలకు కూడా మంచిది, కానీ ఎందుకో మరి చిరంజీవి మీద ఇలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు అని పరిశ్రమలో అంటున్నారు. 'ఆచార్య' సినిమా ఫ్లాప్ అయింది, అయితే అన్ని సినిమాలు అలానే వుంటాయా ఏంటి, హిట్ మరియు ఫ్లాప్ అన్నవి పరిశ్రమలో అందరి నటులకు వుంటుందని, అందువల్ల నెగెటివ్ ప్రచారం మంచిది కాదని పరిశ్రమలో అనుకుంటున్నారు. కోవిడ్ సమయం లో చిరంజీవి సినిమా పరిశ్రమలో వున్న ఎంప్లాయూస్ కోసం చేసిన సేవ ఎవ్వరూ మర్చిపోకూడదు. అలాగే, ఆ తరువాత కూడా అదే ఎంప్లాయూస్ ఆరోగ్యం కోసం చిరంజీవి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎంతో హర్షించదగినవి. ఎప్పుడూ పరిశ్రమ బాగు కోరే చిరంజీవి మీద ఎందుకు పని కట్టుకొని ఒక బ్యాచ్ నెగెటివ్ ప్రచారం చేస్తోందో అర్థం కావటం లేదు అని పేరు చెప్పటం ఇష్టం లేని ఒక నిర్మాత అన్నాడు. అనంతపురం సభకి అంతమంది వస్తారని చిరంజీవి కూడా వూహించలేదు అని, అంతమందిని చూశాక చాలా భావోద్వేగానికి గురయ్యారని చెప్పాడు ఆ నిర్మాత. అలాగే చిరంజీవి గారు చిన్న సినిమాని ప్రోత్సహించాలనే వుద్దేశ్యంతో చాలా సినిమాలకు ముఖ్య అతిధిగా వచ్చి ఆ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ విషయాలను కూడా నెగెటివ్ గా ప్రచారం చేశారు పరిశ్రమలో వున్న ఈ బ్యాచ్. ఎందుకు ఇంతలా చిరంజీవి మీద నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు?

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.