Puneeth Rajkumar లేడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న Shivarajkumar!

ABN , First Publish Date - 2021-11-01T19:50:02+05:30 IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం ఎంతో మందిని కలిచివేసింది.

Puneeth Rajkumar లేడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న Shivarajkumar!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం ఎంతో మందిని కలిచివేసింది. కన్నడ ప్రజలే కాకుండా దేశం మొత్తం పునీత్‌కు ఘనంగా నివాళులర్పించింది. కంఠీరవ స్టేడియంలో అధికారిక లాంఛనాల మధ్య పునీత్ అంత్యక్రియలు ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. పునీత్ సోదరుడు, హీరో శివరాజ్‌కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడారు. క్లిష్ట సమయంలో ఎంతగానో సహకరించిన ప్రభుత్వానికి, పోలీసులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. 


`నేను పునీత్ కంటే 13 ఏళ్లు పెద్దవాడిని. అతడు రోజుల పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా కడుపున పుట్టిన కొడుకు పోయినట్టుగా అనిపిస్తోంది. మా కుటుంబం మొత్తానికి ఇది కోలుకోలేని షాక్. అప్పు మనతో లేడనే విషయం జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. అభిమానులు కూడా ఆ విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు. అయినా మనం ముందుకు వెళ్లక తప్పదు. మన కోసం, మన కుటుంబాల కోసం పనిచేయక తప్పద`ని శివరాజ్‌కుమార్ అన్నాడు. కాగా, కంఠీరవ స్టూడియో వద్ద పోలీసులు భద్రతను మరింత పెంచారు. ఐదో రోజు కుటుంబ సభ్యులు సమాధి వద్ద పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే అభిమానులను లోపలికి అనుమతించనున్నారు. 

Updated Date - 2021-11-01T19:50:02+05:30 IST