విజయ్ సేతుపతి సరసన.. శివానీకి లక్కీఛాన్స్‌

ABN , First Publish Date - 2022-01-15T03:06:08+05:30 IST

బిగ్‌బాస్‌ తమిళ రియాల్టీ షో ద్వారా మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుని, బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యంగ్‌ హీరోయిన్‌ శివానీ నారాయణన్‌. తాజాగా విశ్వనటుడు కమల్‌ హాసన్‌, యంగ్‌ టాలెంటెడ్‌

విజయ్ సేతుపతి సరసన.. శివానీకి లక్కీఛాన్స్‌

బిగ్‌బాస్‌ తమిళ రియాల్టీ షో ద్వారా మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుని, బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యంగ్‌ హీరోయిన్‌ శివానీ నారాయణన్‌. తాజాగా విశ్వనటుడు కమల్‌ హాసన్‌, యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘విక్రమ్‌’ చిత్రంలో విజయ్‌ సేతుపతి సరసన ఆమె నటిస్తున్నట్టు సమాచారం.


ఇదిలా ఉండగా పొన్‌రాం దర్శకత్వంలో నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. విజయ్‌ సేతుపతి హీరోగా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించే ఈ చిత్రంలో శివానీ కూడా పోలీస్‌ పాత్రనే పోషిస్తోంది. దర్శకుడు పొన్‌రాంతో కలిసి శివానీ టీషర్ట్‌, ఖాకీ ఫ్యాంట్‌ ధరించి ఫొటో దిగి, దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈమె పొన్‌రాం దర్శకత్వంలో నటించడం ఖాయమని తేలిపోయింది. అయితే, విజయ్‌ సేతుపతి సరసన నటిస్తుందా? లేక ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. ఇదే కాకుండా ఆర్‌.జె. బాలాజీ చిత్రంలో కూడా నటించబోతున్నట్లుగా ఆమె ప్రకటించింది.

Updated Date - 2022-01-15T03:06:08+05:30 IST