వివాదాలు చుట్టు ముట్టడంతో సోషల్ మీడియా అకౌంట్‌లను డిలీట్ చేసిన శిల్పాశెట్టి భర్త

ABN , First Publish Date - 2021-11-02T00:24:50+05:30 IST

కొన్ని నెలల క్రితం వరకు శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్‌లు పెడుతూనే ఉండేవాడు. కానీ, ఆయనను పోర్న్ కేసులో జులైలో పోలీసులు అరెస్టు చేశారు.

వివాదాలు చుట్టు ముట్టడంతో సోషల్ మీడియా అకౌంట్‌లను డిలీట్ చేసిన శిల్పాశెట్టి భర్త

కొన్ని నెలల క్రితం వరకు శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా  సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్‌లు పెడుతూనే ఉండేవాడు. కానీ, ఆయనను పోర్న్ కేసులో జులైలో పోలీసులు అరెస్టు చేశారు. షెర్లీన్ చోప్రా కూడా పరువు నష్టం దావా వేయడంతో వివాదాలు మెడకు చుట్టుకున్నాయి.  అటువంటి తలనొప్పులు ఎందుకు అనుకోడేమో గానీ తాజాగా ఆయన సోషల్ మీడియా అకౌంట్‌లను డిలీట్ చేశారు. 


పోర్న్ కేసులో అరెస్టు కానంత వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫొటోలను పోస్ట్ చేస్తూండే వారు. వీడియోలను కూడా నెటిజన్లతో పంచుకునేవారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత కూడా ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం లేదు. ఎటువంటి కంటెంట్‌ను కూడా షేర్ చేయడం లేదు. 


పొర్నోగ్రాఫిక్ కంటెంట్‌ను నిర్మించి, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడనే ఆరోపణాలతో జులైలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ‘‘ పొర్నోగ్రాఫిక్ కంటెంట్‌ను నిర్మించి, పబ్లిష్ చేస్తున్నారని ఆయనకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2021లో కేసు నమోదు అయింది. ఈ కేసులో ముఖ్య నిందితునిగా మేం రాజ్ కుంద్రాను జులై 19న అరెస్టు చేశాం. ఆయనను అరెస్టు చేయడానికి కావలసిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి ’’ అని ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు. 


రాజ్ కుంద్రా అరెస్టు అనంతరం శిల్పాశెట్టి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం లేదు. ఆమె భర్త అరెస్టు కావడంతో అప్పట్లో సోషల్ మీడియాలో ఒక ప్రకటనను విడుదల చేసింది. తనకు, తన పిల్లలకు ప్రైవసీని ఇవ్వాలని కోరింది.



Updated Date - 2021-11-02T00:24:50+05:30 IST