పెళ్లి తర్వాత పేరు మార్చేసిన నటి.. ఇకపై మిసెస్ అక్తర్..

ABN , First Publish Date - 2022-02-23T19:23:43+05:30 IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్, నటి శిభానీ దండేకర్ గత వారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే...

పెళ్లి తర్వాత పేరు మార్చేసిన నటి.. ఇకపై మిసెస్ అక్తర్..

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్, నటి శిభానీ దండేకర్ గత వారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 21న వీరు తమ పెళ్లిని ముంబైలో రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో మిస్ శిభానీ దండేకర్ కాస్తా మిసెస్ అక్తర్‌గా మారిపోయింది. 


తాజాగా ఈ నటి ఇన్‌స్టాగ్రామ్‌లోని తన పేరుని శిబాని దండేకర్ అక్తర్‌గా మార్చింది. అంతేకాకుండా తన బయోలో సైతం.. ‘నిర్మాత, ప్రజెంటర్, నటి, గాయని. మిసెస్ అక్తర్‌’గా రాసుకొచ్చింది. అయితే ఫరాన్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. 


ఫరాన్, శిబాని పెళ్లి నటుడి తండ్రి జావేద్ అక్తర్ ఇంట్లో చాలా సింపుల్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. అందులో ఫ్యామిలీ కాకుండా బాలీవుడ్ నుంచి నటి రియా చక్రవర్తి, నటుడు హృతిక్ రోషన్, ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కపుల్ పెళ్లి తర్వాత వీరిద్దరూ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.

Updated Date - 2022-02-23T19:23:43+05:30 IST