‘బిగ్‌బాస్‌’ ఇచ్చిన క్రేజ్‌ను బాగా వాడుతోంది

ABN , First Publish Date - 2022-04-26T03:08:10+05:30 IST

‘బిగ్‌బాస్‌’ తమిళ సీజన్‌-3 ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న యువనటి షెరీన్‌ ష్రింగర్‌ వరుస సినిమా అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆమె..

‘బిగ్‌బాస్‌’ ఇచ్చిన క్రేజ్‌ను బాగా వాడుతోంది

‘బిగ్‌బాస్‌’ తమిళ సీజన్‌-3 ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న యువనటి షెరీన్‌ ష్రింగర్‌ వరుస సినిమా అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆమె పచ్చరంగు గౌనులో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా, వాటిని సూచిన ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజానికి షెరీన్‌ ఒకప్పుడు తమిళ సినీ అభిమానుల కలల రాణిగా కొనసాగింది. ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. అదే సమయంలో కాస్త బొద్దుగా ఉండడంతో సినిమాలకు దూరమైంది. 


అయితే, విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా నటించిన బిగ్‌బాస్‌ తమిళ సీజన్‌-3లో ఎంట్రీ ఇవ్వగా, ఈ షో ఆమెకు మంచి గుర్తింపుతో పాటు క్రేజ్‌ తెచ్చిపెట్టింది. దీంతో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటోంది. ఈ జోరును ఇలాగే కొనసాగించాలన్న పట్టుదలతో ఆమె సోషల్‌ మీడియా వేదికగా గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తోంది.



Updated Date - 2022-04-26T03:08:10+05:30 IST