Shekhar Kapur: భారత్‌లోని ఫిల్మ్ మేకర్స్ రాజమౌళి అడుగుజాడల్లో నడవాలి

ABN , First Publish Date - 2022-08-22T01:17:41+05:30 IST

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్

Shekhar Kapur: భారత్‌లోని ఫిల్మ్ మేకర్స్ రాజమౌళి అడుగుజాడల్లో నడవాలి

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ మే 20నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫాంలోకీ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి విదేశీ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన అనేక మ్యాగజైన్స్ సైతం ఈ మూవీని ప్రశంసిస్తూ రివ్యూస్ కూడా రాశాయి. ఓ మ్యాగజైన్ అయితే మరో అడుగు ముందుకేసి ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పింది. అయితే, ప్రముఖ ఫిల్మ్ మేకర్ శేఖర్ కపూర్ (Shekhar Kapur) ఆ మ్యాగజైన్ క్లిప్‌ను షేర్ చేస్తూ రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించాడు. ‘‘ఆర్ఆర్ఆర్ సినిమా భారత్‌నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని అబ్బురపరిచింది. నా స్నేహితుడు యస్‌యస్. రాజమౌళికి శుభాకాంక్షలు. భారత్‌లోని ఫిల్మ్‌మేకర్స్ అందరు మీ అడుగు జాడల్లో నడుస్తారని ఆశిస్తున్నాను’’ అని శేఖర్ కపూర్ ట్వీట్ చేశాడు. 

 

ఇండియన్ ఫిలింమే‌కర్ అయిన శేఖర్ కపూర్ ఫిల్మ్ ఫేర్, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అతడు ఆగస్టు 8న యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli)తో ఓ రోజుని గడిపాడు. ఈ సందర్భంగా రాజమౌళిని గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా అభివర్ణించాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘..‘గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ యస్‌యస్. రాజమౌళితో ఓ రోజుని గడపడం అద్భుతంగా ఉంది. ఈ సందర్భంగా ఫిల్మ్ మేకింగ్, కథలు, టెక్నాలజీ, ఫిలాసఫీ గురించి చర్చించుకున్నాం. అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మీ కుటుంబం ఇచ్చిన అతిథ్యానికి ధన్యుడిని. రాబోయే రోజుల్లో మరెన్నో సార్లు కలుసుకోవాలని ఆశిస్తున్నాను’’ అని శేఖర్ కపూర్ తెలిపాడు. అతడి ట్వీట్‌కు రాజమౌళి రిప్లై ఇచ్చాడు. ‘‘మీ నుంచి కొంచెం ధైర్యం వస్తుందని ఆశిస్తున్నాను. మీ సినిమా ‘పానీ’ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. గేట్లను ఎత్తడానికి సమయం ఆసన్నమైంది’’ అని రాజమౌళి పేర్కొన్నాడు.





Updated Date - 2022-08-22T01:17:41+05:30 IST