Shekar Movie: రాజశేఖర్‌ ఆవేదన!

ABN , First Publish Date - 2022-05-22T22:28:18+05:30 IST

రాజశేఖర్‌ హీరోగా జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించిన ‘శేఖర్‌’ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం సమస్యల్లో చిక్కుతుంది. బాగా ఆడుతున్న సినిమాను నిలిపేయాలంటూ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవితా రాజశేఖర్‌ అప్పు తీసుకున్న రూ. 65 లక్షలు తిరిగి చెల్లించలేదని ఫైనాన్షియర్‌ పరంధామరెడ్డి కోర్టును ఆశ్రయించారు.

Shekar Movie: రాజశేఖర్‌ ఆవేదన!

రాజశేఖర్‌(Raj sekhar) హీరోగా జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించిన ‘శేఖర్‌’ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం సమస్యల్లో చిక్కుతుంది. బాగా ఆడుతున్న సినిమాను నిలిపేయాలంటూ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవితా రాజశేఖర్‌ (Jeevitha rajashekar)అప్పు తీసుకున్న రూ. 65 లక్షలు తిరిగి చెల్లించలేదని ఫైనాన్షియర్‌ పరంధామరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ విచారణకు స్వీకరించిన కోర్టు ‘శేఖర్‌’ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హీరో రాజశేఖర్‌ స్పందించారు. ‘‘శేఖర్‌’ సినిమా నాకు, నా కుటుంబానికి చాలా కీలకం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాం. విడుదలయ్యాక సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ సమయంలో కొందరు కుట్ర చేసి మా సినిమా ప్రదర్శన అడ్డుకుంటున్నారు. సినిమా అనేది మా ప్రాణం. అందులోనూ ఎంతో కష్టపడిన ఈ చిత్రం చాలా ప్రత్యేకం. ఇంతకు మించి చెప్పడానికి ఏమీలేదు. ఎవరెన్ని చేసిన ఈ సినిమా బాగా ఆడుతూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుదనీ, ఆ అర్హత ఈ చిత్రానికి ఉంది’’ అని రాజశేఖర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 




Updated Date - 2022-05-22T22:28:18+05:30 IST