Shekar: రూ.65 లక్షలు చెల్లించకపోతే ‘శేఖర్‌’ ఆగిపోతుంది!

ABN , First Publish Date - 2022-05-21T22:18:40+05:30 IST

‘‘కోర్డు ఆదేశాల మేరకు రూ.65 లక్షలు డిపాజిట్‌ చేయకపోతే ‘శేఖర్‌’(Shekar) సినిమా ప్రదర్శన ఆగిపోతుంది’’ అని ఫైనాన్షియర్‌ ఎ.పరంధామరెడ్డి (A parandhama reddy) పేర్కొన్నారు. రాజశేఖర్‌ (Rajashekar)హీరోగా నటించిన ‘శేఖర్‌’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే!

Shekar: రూ.65 లక్షలు చెల్లించకపోతే ‘శేఖర్‌’ ఆగిపోతుంది!

‘‘కోర్డు ఆదేశాల మేరకు రూ.65 లక్షలు డిపాజిట్‌ చేయకపోతే ‘శేఖర్‌’(Shekar) సినిమా ప్రదర్శన ఆగిపోతుంది’’ అని ఫైనాన్షియర్‌ ఎ.పరంధామరెడ్డి (A parandhama reddy) పేర్కొన్నారు. రాజశేఖర్‌ (Rajashekar)హీరోగా నటించిన ‘శేఖర్‌’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే! ఈ చిత్రం కోసం ఎ.పరంధామరెడ్డి దగ్గర రూ.65,00,000/– దర్శకనిర్మాత జీవితా రాజశేఖర్‌ అప్పుగా తీసుకున్నారు. ఆ మొత్తం చెల్లించకపోవడంతో పరంధామరెడ్డి  హైదరాబాద్‌ సిటీ సివిల్‌కోర్టు కోర్టును ఆశ్రయించారు.


‘‘48 గంటలలోగా రూ.65 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా జీవిత రాజశేఖర్‌ (Jeevitha rajashekar)సమర్పించాలి. అలా చేయని పక్షంలో ‘శేఖర్‌’ సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను (నెగటివ్‌ రైట్‌) అటాచ్‌మెంట్‌ చేస్తూ డిజిటల్‌, శాటిలైట్‌, ఓటీటీ, యూట్యూబ్‌ వంటి మాధ్యమాలతోపాటు సినిమా ట్రైలర్‌ను కూడా ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటాచ్‌మెంట్‌ అమలులోకి వస్తే ఆదివారం సాయంత్రం తర్వాత ‘శేఖర్‌’ (Shekar)సినిమాను ఏ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించినా న్యాయస్థానాన్ని ధిక్కరించినట్లు అవుతుంది’’ అని ఎ.పరంధామరెడ్డి హెచ్చరించారు.


Updated Date - 2022-05-21T22:18:40+05:30 IST