Salman ను హత్తుకుపోయిన బ్యూటీ... తప్పుడు అర్థాలు తీస్తోన్న ఆన్ లైన్ ట్రోల్స్...

ABN , First Publish Date - 2022-05-06T01:03:47+05:30 IST

రంజాన్ నెల పూర్తైన సందర్భంగా, ఈద్ ను పురస్కరించుకుని... Salman చెల్లెలు అర్పితా ఖాన్, ఆమె భర్త ఆయుష్ శర్మ మంగళవారం భారీ విందు ఏర్పాటు చేశారు. సహజంగానే సినిమా రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు పార్టీకి హాజరయ్యారు. నటి Shehnaaz Gill కూడా అతిథిగా అక్కడికి వచ్చింది.

Salman ను హత్తుకుపోయిన బ్యూటీ... తప్పుడు అర్థాలు తీస్తోన్న ఆన్ లైన్ ట్రోల్స్...

రంజాన్ నెల పూర్తైన సందర్భంగా, ఈద్ ను పురస్కరించుకుని... Salman చెల్లెలు అర్పితా ఖాన్, ఆమె భర్త ఆయుష్ శర్మ మంగళవారం భారీ విందు ఏర్పాటు చేశారు. సహజంగానే సినిమా రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు పార్టీకి హాజరయ్యారు. నటి Shehnaaz Gill కూడా అతిథిగా అక్కడికి వచ్చింది.


పండుగ సందర్భంగా ఏర్పాటైన విందుకి హాజరైన చాలా మంది బీ-టౌన్ లేడీస్ కి సల్మాన్ స్వయంగా వీడ్కోలు పలికాడు. వార్ని కార్లలో ఎక్కే వరకూ దగ్గరుండి సాగనపంపాడు. అయితే, షెహనాజ్ కి కూడా సల్మాన్ అదే విధంగా సెండాఫ్ ఇచ్చాడు. కాకపోతే, ఆమె ఆ సమయంలో బాలీవుడ్ భాయ్ జాన్ ని గట్టిగా వాటేసుకోవటం, అతడి భుజంపై ముద్దు పెట్టుకోవటం చాలా మంది నెటిజన్స్ దృష్టిలో పడింది. Shehnaaz Gill , Salman మధ్య Bigg Boss సందర్భంగా మంచి స్నేహం ఏర్పడింది. ఆ చనువుతోనే ఆమె అలా ప్రవర్తించింది. కానీ, ఆన్ లైన్ ట్రోలర్స్ తప్పుడు అర్థాలు తీశారు. రకరకాల కామెంట్స్ తో షెహనాజ్ ను కార్నర్ చేశారు... 


సల్మాన్ తో షెహనాజ్ సన్నిహితంగా మెలగటంతో ‘‘మద్యం తాగాక తను స్పృహలో లేనట్టుంది...’’ అని ఒకరు విమర్శించారు. మరోకరైతే, షెహనాజ్ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ శుక్లా పేరుని కూడా చర్చలోకి లాగారు. ఆయన చనిపోవటంతో ఇప్పుడు ఈమె సల్మాన్ వెంటపడుతోందని దారుణంగా కామెంట్ చేశారు. ఇంకో నెటిజన్ కూడా సిద్ధార్థ్ శుక్లా పేరు ప్రస్తావిస్తూ... ‘‘సిద్ధార్థ్ శుక్లాతో తను చేసినవన్నీ ఇప్పుడు మళ్లీ మొదలెట్టింది. వాటేసుకోటాలు / ముద్దులు. పూర్తిగా చౌకబారుతనం. నేనైతే తనని ఎప్పుడూ నమ్మలేదు...’’ అన్నారు.


కొందరు షెహనాజ్ గిల్ ను టార్గెట్ చేస్తుంటే మరికొందరు ఆమెకు అండగా కూడా నిలిచారు. ప్రేమించిన వాడు హఠాత్తుగా మరణిస్తే... ఆ అమ్మాయి పడే బాధ మనకి అర్థం కాదంటూ... సానుభూతి ప్రకటించారు. అయినా కూడా షెహనాజ్ మరోసారి కొత్తగా జీవితంలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఆమెని ప్రొత్సహించాలి కానీ తిట్టిపోయవద్దని హితవు పలికారు. 


బుల్లితెరపై ఇంత కాలం నటిగా కొనసాగిన షెహనాజ్ గిల్ త్వరలో సల్మాన్ నటిస్తోన్న ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా షెహనాజ్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. 

Updated Date - 2022-05-06T01:03:47+05:30 IST