Sharwanand: ఆశలన్నీ 'ఒకే ఒక జీవితం'పైనే..

ABN , First Publish Date - 2022-09-03T17:18:29+05:30 IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మినిమం గ్యారెంటీ హీరోలలో శర్వానంద్ (Sharwanand) కూడా ఒకరు. ఆయన నటించిన సినిమాలు అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటున్నాయి. అయితే,

Sharwanand: ఆశలన్నీ 'ఒకే ఒక జీవితం'పైనే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మినిమం గ్యారెంటీ హీరోలలో శర్వానంద్ (Sharwanand) కూడా ఒకరు. ఆయన నటించిన సినిమాలు అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటున్నాయి. అయితే, ఇటీవల కాలంలో ఈ యంగ్ హీరోకి హిట్టే కరువైంది. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో సతీష్ వేగేష్న రూపొందించిన శతమానం భవతి భారీ చిత్రాలతో పోటీపడి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శర్వా మార్కెట్ బాగా పెరిగింది. అయితే, దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాడు.


శతమానం భవతి తర్వాత వచ్చిన పడి పడి లేచె మనసు, శ్రీకారం, జాను, రణరంగం, మహా సముద్రం, ఆడవాళ్ళు మీకు జోహార్లు వరుసగా ఫ్లాపయ్యాయి. ప్రస్తుతం శర్వా చేస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. ఇది శర్వా కెరీర్‌లో చేస్తున్న 30వ సినిమా కావడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ తెలుగు - తమిళ భాషలలో రిలీజైంది. యువ సంగీతకారుడిగా శర్వానంద్ కనిపించబోతున్నాడు. ఇందులో అక్కినేని అమల (Akkineni Amala) కీలక పాత్రలో, రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌గా నటిస్తున్నారు.


ఈ ద్విభాషా చిత్రంతో శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు - ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇందులోలో డైలాగ్స్ రాశారు. సెప్టెంబర్ 9వ తేదీన తెలుగుతో పాటు తమిళంలో కణం పేరుతో రిలీజ్ కాబోతోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో శర్వా ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. ఈ మూవీ గనక హిట్ అయితే మళ్ళీ ఫాంలోకి వచ్చి అవకాశాలు అందుకుంటాడు. లేదంటే కెరీర్ కాస్త ఇబ్బందుల్లో పడుతుందనడంలో సందేహించాల్సిన పని లేదు. 

Updated Date - 2022-09-03T17:18:29+05:30 IST