నా కుటుంబం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా Salman Khan తోడుంటాడు: Sharukh Khan

ABN , First Publish Date - 2021-10-08T17:27:23+05:30 IST

గత కొంత కాలంగా సినిమా హీరోగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఇప్పుడు కొడుకు ఆర్యన్ ఖాన్ కారణంగా ఇబ్బందుల్లో పడ్డాడు.

నా కుటుంబం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా Salman Khan తోడుంటాడు: Sharukh Khan

గత కొంత కాలంగా సినిమా హీరోగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఇప్పుడు కొడుకు ఆర్యన్ ఖాన్ కారణంగా ఇబ్బందుల్లో పడ్డాడు. ఆర్యన్ ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో షారూక్ ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. ఈ నేపథ్యంలో షారూక్‌కు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలబడ్డాడు. ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిన వెంటనే షారూక్ ఇంటికి వెళ్లాడు. షారూక్‌కు భరోసాగా నిలిచాడు. 


ఈ నేపథ్యంలో షారూక్, సల్మాన్‌ స్నేహానికి సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సల్మాన్ హోస్ట్ చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన షారూక్ స్నేహం గురించి మాట్లాడాడు. `నీ కష్టాల్లో, సుఖాల్లో తోడుగా నిలిచే స్నేహితుడు ఎవరు` అని షారూక్‌ను సల్మాన్ ప్రశ్నించాడు. దానికి షారూక్ స్పందిస్తూ.. `సల్మాన్.. నేను, నా కుటుంబం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా వెంటనే స్పందించేంది నువ్వే` అంటూ సల్మాన్‌ను కౌగిలించుకున్నాడు. ఆ సందర్భంగా వారిద్దరూ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 



Updated Date - 2021-10-08T17:27:23+05:30 IST