Shankar: ఒకేసారి రెండు సినిమాలు..!

ABN , First Publish Date - 2022-07-28T14:58:40+05:30 IST

ఇండియన్ జేమ్స్ కేమరూన్ అనే పేరు తెచ్చుకున్న సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

Shankar: ఒకేసారి రెండు సినిమాలు..!

ఇండియన్ జేమ్స్ కేమరూన్ అనే పేరు తెచ్చుకున్న సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ క్రేజీ స్టార్ కియారా అద్వానీ (Kiyara Advani) ఇందులో చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. రోబో తర్వాత శంకర్ నుంచి వచ్చిన ఐ, రోబో 2.ఓ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. మధ్యలో ఇండియన్ - 2 (Indian 2) సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆగిపోయింది. 


దాంతో తెలుగులో మొదటిసారి చేస్తున్న స్ట్రైట్ మూవీ ఆర్సీ 15 తో భారీ హిట్ కొట్టాలని కసిగా ఉన్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు కమల్ హాసన్‌ (Kamal Haasan)తో చేస్తున్న ఇండియన్ 2 ప్రాజెక్ట్ మళ్ళీ సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ సినిమా చాలా నెలలుగా ఆగిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల నిలిచిపోయిన ప్రాజెక్ట్ మళ్ళీ అన్నీ క్లియర్ అవడంతో సినిమాను పూర్తి చేసేందుకు శంకర్ ఒప్పుకున్నారు.


ఈ నేపథ్యంలో ఇదే ఏడాది డిసెంబర్ నుంచి ఇండియన్ 2 మిగిలిన చిత్రీకరణ మొదలవనుందని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం సెప్టెంబర్ నుంచి ఒకవైపు ఆర్సీ 15 చేస్తూనే మరో వైపు ఇండియన్ 2 షూటింగ్ కూడా కంప్లీట్ చేయనున్నారట. నెలలో సగం రోజులు ఓ సినిమా, మిగతా సగం రోజులు మరో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నారట. అలా గనక కంప్లీట్ అయితే రెండు భారీ పాన్ ఇండియన్ చిత్రాలు శంకర్ నుంచి రావడం గ్యారెంటీ. అది కూడా పెద్ద గ్యాప్ లేకుండానే. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో.   

Updated Date - 2022-07-28T14:58:40+05:30 IST