Shankar: 2023లో వరుసగా రెండు పాన్ ఇండియన్ సినిమాలు..?

ABN , First Publish Date - 2022-06-09T17:07:32+05:30 IST

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇండియన్ జేమ్స్ కేమరూన్ అనే పేరు సంపాదించుకున్న దర్శకుడు శంకర్ (Shankar). ఏ జోనర్‌లో సినిమా తీసిన తప్పకుండా అందులో సోషల్ మెసేజ్ చాలా స్ట్రాంగ్‌గా చూపిస్తారు.

Shankar: 2023లో వరుసగా రెండు పాన్ ఇండియన్ సినిమాలు..?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇండియన్ జేమ్స్ కేమరూన్ అనే పేరు సంపాదించుకున్న దర్శకుడు శంకర్ (Shankar). ఏ జోనర్‌లో సినిమా తీసిన తప్పకుండా అందులో సోషల్ మెసేజ్ చాలా స్ట్రాంగ్‌గా చూపిస్తారు. ఇటీవల ఆయన నుంచి భారీ హిట్ రాలేదనే చెప్పాలి. రోబో (Robot) తర్వాత చేసిన ఐ (I), రోబో 2.ఓ (Robot 2.o) వచ్చినా ఆశించిన విజయాలను అందుకోలేపోయాయి. అందుకే, శంకర్ నుంచి ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ వస్తే చూడాలని ఇండియన్ వైడ్ ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


అయితే, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఓ సాంగ్, భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు కొంత టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇక ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, హిందీలో అపరిచితుడు (Aparichitudu) చిత్రాన్ని రణ్‌వీర్ సింగ్‌ (Ranveer Singh)తో రీమేక్ చేయనున్నారు.


అయితే, తాజా సమాచారం మేరకు ఎప్పుడో ఆగిపోయిన కమల్ హాసన్ ఇండియన్ 2 (Indian 2) మళ్ళీ మొదలుపెట్టేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నారట. నిర్మాతలతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఎట్టకేలకు ఈ సినిమాను పూర్తి చేసేందుకు ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చరణ్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారట. ఈ ఏడాది చివరకు ఇండియన్ 2 కంప్లీట్ చేసి 2023, సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇండియన్ 2 తర్వాత పెద్ద గ్యాప్ లేకుండానే ఆర్సీ 15ను కూడా రిలీ చేసేలా శంకర్ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే గనక ఆయన నుంచి వచ్చే ఏడాది 2 భారీ పాన్ ఇండియన్ సినిమాలు వస్తాయి.

Updated Date - 2022-06-09T17:07:32+05:30 IST