Shankar: షిఫ్ట్ పద్ధతిలో కమల్ హాసన్, రామ్ చరణ్ సినిమాలు

ABN , First Publish Date - 2022-08-24T23:46:40+05:30 IST

ప్రముఖ దర్శకుల్లో ఒకరైన శంకర్‌ (Shankar)కు ఇప్పుడొక పెద్ద చిక్కు వచ్చి పడింది. అతను ఇప్పుడు రెండు సినిమాలు షూటింగ్ చేయాల్సి వస్తోంది. చరణ్‌తో RC15 సినిమా షూటింగ్ మొదలయ్యాక, కమల్ హాసన్

Shankar: షిఫ్ట్ పద్ధతిలో కమల్ హాసన్, రామ్ చరణ్ సినిమాలు

ప్రముఖ దర్శకుల్లో ఒకరైన శంకర్‌ (Shankar)కు ఇప్పుడొక పెద్ద చిక్కు వచ్చి పడింది. అతను ఇప్పుడు రెండు సినిమాలు షూటింగ్ చేయాల్సి వస్తోంది. చరణ్‌తో RC15 సినిమా షూటింగ్ మొదలయ్యాక, కమల్ హాసన్ (Kamal Haasan) ఇండియన్ 2 (Indian 2) సినిమా కూడా చేయాలని.. ఆ చిత్ర నిర్మాతలు పట్టుపట్టడంతో ఇప్పుడు శంకర్, చరణ్ సినిమా వదిలేసి ఇండియన్ 2 సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై‌లో జరుగుతుంది. ఇది ఒక రెండు వారాల పాటు చేయాలని అనుకుంటున్నారు. ఇందులో హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ (Rakul Preet) ఈనెల 27న చెన్నైలో షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది. 


ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత శంకర్ మళ్ళీ తెలుగు సినిమా షూటింగ్ రామ్ చరణ్‌ (Ram Charan)తో స్టార్ట్ చేస్తారు. రెండు నెలలు ఇండియన్‌కి గ్యాప్ ఇస్తారు. ఇక్కడ మళ్ళీ కొంత షూట్ అయ్యాక, చెన్నై వెళతారు. ఇలా షిఫ్ట్ పద్ధతుల్లో రెండు సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. ఈమధ్యలో మళ్ళీ ఏవైనా అవాంతరాలు ఎదురుకాకపోతే.. ఈ రెండు సినిమాలు ఎప్పటికి పూర్తి అవుతాయో ఆ శంకరుడుకే తెలియాలి.





Updated Date - 2022-08-24T23:46:40+05:30 IST