మరో టాలీవుడ్ స్టార్‌తో Shankar ?

ABN , First Publish Date - 2022-06-06T16:10:18+05:30 IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar).. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) తో మొట్టమొదటి సారిగా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ కెరీర్ లో ఇది 15వ చిత్రం కాగా.. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా 50వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది.

మరో టాలీవుడ్ స్టార్‌తో Shankar ?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar)..  మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) తో మొట్టమొదటి సారిగా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ కెరీర్ లో ఇది 15వ చిత్రం కాగా.. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్‌లో 50వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. ఇక ఈ సినిమాకి ఇదివరకు ‘విశ్వంభర (Viswamhhara), సర్కారోడు (Sarkarodu)’ అనే టైటిల్స్ ప్రచారంలోకి రాగా.. తాజాగా ‘అధికారి’ (Adhikari) అనే మరో టైటిల్ వినిపిస్తోంది.  ఈ సినిమాలో రామ్‌చరణ్ ఎన్నికల కమీషనర్‌గా, ఐఎయస్ అధికారిగా కనిపిస్తాడని ఇదివరకు వార్తలొచ్చాయి. అయితే అతడి పాత్ర ఏంటనేది ఇప్పటివరకూ అధికారికంగా తెలియలేదు. అలాగే. ఇందులో చెర్రీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని కూడా వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్‌తో సినిమా పూర్తయిన వెంటనే.. శంకర్ యంగ్ టైగర్ యన్టీఆర్‌ (NTR) తో కూడా ఓ సినిమా చేస్తాడని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాతగా వ్యహరించ బోతున్నట్టు టాక్.  


శంకర్ తో ఓ సినిమా తీయాలని దిల్ రాజు ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2)కి ఒకదశలో ఆయనే నిర్మాత. కానీ ఎందుకనో అది కుదరలేదు. అప్పుడిచ్చిన అడ్వాన్సులతోనే చెర్రీ హీరోగా శంకర్ దర్శకత్వంలోని సినిమాను సెట్ చేశాడు దిల్ రాజు. ఈ సినిమా కథ డిస్కషన్ సమయంలోనే దిల్ రాజుకు శంకర్ మరో అదిరిపోయే కథ వినిపించాడట. అది దిల్ రాజు కు బాగా నచ్చిందని , ఆ కథతోనే యన్టీఆర్ హీరోగా ఓ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్టు వినికిడి. శంకర్ దర్శకత్వం అంటే యన్టీఆర్ నో చెప్పే అవకాశమే లేదు. ఎలాగూ దిల్ రాజు హస్తముంది. అందుకే ఈ కాంబో ఖచ్చితంగా సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం RC15 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రధమార్ధంలో విడుదల చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. దీని తర్వాత వెంటనే యన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళుతుందట. మరి ఈ సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. 

Updated Date - 2022-06-06T16:10:18+05:30 IST