Shankar: రామ్ ‌చరణ్‌తో ఆ సెంటిమెంట్‌ని జయిస్తాడా?

ABN , First Publish Date - 2022-07-22T03:01:32+05:30 IST

ఈ మధ్య కాలంలో తమిళ దర్శకులు తెలుగు హీరోలతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌ సినిమాలుగా మిగిలాయి. తమిళ్‌లో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మురుగదాస్ (AR Murugadoss) తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో

Shankar: రామ్ ‌చరణ్‌తో ఆ సెంటిమెంట్‌ని జయిస్తాడా?

ఈ మధ్య కాలంలో తమిళ దర్శకులు తెలుగు హీరోలతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద  ప్లాప్‌ సినిమాలుగా మిగిలాయి. తమిళ్‌లో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మురుగదాస్ (AR Murugadoss) తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘స్పైడర్’ (Spyder) మూవీ చేశారు. ఈ సినిమా మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ తరువాత మహేష్‌కు తమిళ దర్శకులతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశాడు. ఇక యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కోలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్‌తో ‘నోటా’ (Nota) మూవీ చేశాడు. బైలింగ్వల్ మూవీగా వచ్చిన  నోటా  కూడా ప్లాప్  అయింది. ఇక రీసెంట్‌గా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) మాస్ చిత్రాల డైరెక్టర్ లింగుసామి (Lingusamy) దర్శకత్వంలో ‘ది వారియర్’ (The Warriorr) మూవీ చేశాడు. కొంతకాలంగా హిట్ లేక సతమతమవుతున్న లింగుసామిని నమ్మి.. ‘ది వారియర్’  చేసిన రామ్‌కు ఈ మూవీ డిజస్పాయింట్ చేసింది. ఈ సినిమాకి పరిస్థితులు కూడా కలిసిరాలేదు. వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోవడంతో సినిమా యావరేజ్ లిస్ట్‌లో చేరిపోయింది.


చిరంజీవి (Chiranjeevi) ‘స్టాలిన్’ (Stalin), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘పంజా’ (Panjaa) వంటి చిత్రాలకు కూడా డైరెక్టర్స్ కోలీవుడ్ వారే. వరుసగా తమిళ స్టార్ డైరెక్టర్లు.. తెలుగు స్టార్లకు ప్లాప్‌ల షాకులిస్తుండడంతో ఇప్పుడు అందరి ఫోకస్ శంకర్ (Shankar) మీదికి మళ్లింది. ఒకప్పుడు తెలుగులో దాదాపుగా ప్రతి స్టార్ శంకర్‌తో ఓ సినిమా చేయాలని ఆశపడ్డారు. ఆయన సూపర్ ఫామ్‌లో ఉండగా.. తెలుగు స్టార్స్ ఎవ్వరితోనూ సినిమాలు చేయలేదు.  వరసగా మూడు ప్లాప్‌ల తర్వాత  రామ్ చరణ్‌ (Ram Charan)తో RC15 సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నప్పటికి, శంకర్ గత సినిమాలని, తమిళ డైరెక్టర్ల సెంటిమెంట్‌ని తలుచుకుంటేనే మెగా ఫ్యాన్స్ (Mega Fans) టెన్షన్ పడుతున్నారు. ఫామ్ కోల్పోయిన శంకర్ ముందు సినిమాల్లాగే ప్లాప్ ఇస్తాడా?  లేక టాలీవుడ్ స్టార్లకు షాక్‌లు ఇస్తున్న అరవ దర్శకుల ట్రెండ్‌ని బ్రేక్ చేసి రామ్ చరణ్‌తో ఆ సెంటిమెంట్‌ని జయిస్తాడా.. అనేది చూడాలి.

Updated Date - 2022-07-22T03:01:32+05:30 IST