Shaama Sikindar : ఎఫైర్ పెట్టుకోకపోతే ఎదగలేం

ABN , First Publish Date - 2022-09-15T22:04:45+05:30 IST

బాలీవుడ్ హాట్ బ్యూటీ షామా సికిందర్ (Shaama Sikindar) గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఆమె నటిగా కన్నా ఓ హాట్ గాళ్ గా నెట్టింట సంచలనం. ఎప్పటికప్పుడు సూపర్ హాట్ పిక్స్ తో నెటిజెన్స్‌ను హీటెక్కించడం ఆమె ప్రత్యేకత.

Shaama Sikindar : ఎఫైర్ పెట్టుకోకపోతే ఎదగలేం

బాలీవుడ్ హాట్ బ్యూటీ షామా సికిందర్ (Shaama Sikindar) గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఆమె నటిగా కన్నా ఓ హాట్ గాళ్ గా నెట్టింట సంచలనం. ఎప్పటికప్పుడు సూపర్ హాట్ పిక్స్ తో నెటిజెన్స్‌ను హీటెక్కించడం ఆమె ప్రత్యేకత. మిగతా భామలకన్నా షామా.. సమ్‌థింగ్ స్పెషల్ అని చెప్పాలి. డిజైనర్ ఎంపికలో తనదైన హాట్ అపీరెన్స్‌తో గిలిగింతలు పెడుతుంటుంది. అలాంటి హాట్ బ్యూటీ.. బాలీవుడ్ ఇండస్ట్రీపై బాంబ్ పేల్చింది. ఇటీవల ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించింది. కొంతమంది దర్శక నిర్మాతలు తనతో స్నేహంగా ఉంటూనే తనతో సెక్స్ కోరుకున్నారని వెల్లడించింది. 


అయితే ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని, ఇండస్ట్రీ చాలా మారిపోయిందన్న ఆమె, యువ నిర్మాతలు చాలా ఫ్రొఫెషనల్‌గా ఉంటూ.. స్త్రీలను గౌరవంగా చూస్తున్నారని తెలిపింది. ఈ తరానికి పనిమీదే ధ్యాస తప్ప సెక్స్ కావాలన్న భావన ఎక్కడా కనిపించడం లేదని చెప్పింది. గతంలో నిర్మాతలంతా ఎఫైర్ పెట్టుకోకపోతే స్నేహితులుగా ఉండలేమని, పనికి ప్రతిఫలంగా తమతో పడుకోవాలని వేధించిన సందర్భాలున్నట్టు గుర్తు చేసుకుంది. చివరగా భయంకరమైన మనుషుల వల్ల ఎందరో స్త్రీల హృదయాలు గాయపడ్డాయని, అయితే వారిలో మహిళల మనసు గెలిచి మన్ననలు పొందిన కొందరున్నారంటూ  చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షామా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి.  



Updated Date - 2022-09-15T22:04:45+05:30 IST