Adipurush: టీజర్‌పై ‘శక్తిమాన్’ ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-10-06T01:53:42+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘ఆదిపురుష్ (Adipurush). కృతి సనన్ (Kriti Sanon), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కీలక పాత్రలు పోషించారు.

Adipurush: టీజర్‌పై ‘శక్తిమాన్’ ఘాటు వ్యాఖ్యలు

గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘ఆదిపురుష్ (Adipurush). కృతి సనన్ (Kriti Sanon), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కీలక పాత్రలు పోషించారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను రూపొందించారు. రూ. 500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. అందులో భాగంగా అక్టోబర్ 2న టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. హిందూ దేవుళ్లను అపహాస్యం చేసేలా టీజర్ ఉందని కొంత మంది విమర్శించారు. ఈ టీజర్‌పై శక్తిమాన్ పాత్రధారి ముఖేశ్ ఖన్నా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 


రాముడు, కృష్ణుడు అర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగర్‌లా ఉండరని ముఖే‌శ్ ఖన్నా(Mukesh Khanna) తెలిపాడు. ‘‘హిందూ దేవుళ్లు రాముడు, కృష్ణుడు హ్యాండ్సమ్‌గా అర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగర్‌లా ఉండరు. వినయ, విధేయతలతో వారు ఉంటారు. బాడీ బిల్డర్స్ రూపంలో ఉండరు. రామునికి, హనుమంతునికి మీసాలు ఉండవు. ‘ఆదిపురుష్’ అని టైటిల్ పెట్టారు. రాతియుగం నాటి మనిషి కథను చెప్పి ఉంటే బాగుండేది. భీష్మునికి గడ్డం ఉంటుంది. గడ్డం లేకుండా ఆ పాత్రను చూపిస్తే బాగుండదు. రామాయణంపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకాలను మీరు సవాల్ చేస్తున్నారు. అందువల్ల ఈ సినిమా నడవదు. విజువల్ ఎఫెక్ట్స్ మీద భారీగా వెచ్చిచినంత మాత్రాన మంచి చిత్రాన్ని రూపొందించలేరు. రూ. 100కోట్ల నుంచి రూ. 1000కోట్ల వరకు ఖర్చు చేసినంత మాత్రాన అది రామాయణం కాదు. విలువలు, ప్రతిభతోనే అటువంటి చిత్రాన్ని తెరకెక్కించవచ్చు. అవతార్ పాత్రల నుంచి స్ఫూర్తి పొంది రామాయణాన్ని నిర్మించలేరు. పాత్రలను అపహాస్యం చేస్తే మీరు నవ్వుల పాలవ్వడంతో పాటు ప్రేక్షకుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఫిక్షనల్ స్టోరీతో సినిమాను రూపొందిస్తున్నామని మీరు చెప్పుకోవచ్చు. కానీ, రామాయణం అని మాత్రం చెప్పకండి. ఆచారాలు, సంప్రదాయాలు, ఇతిహాసాలను మార్చడానికి డబ్బులను వృథా చేయకండి’’ అని ముఖేశ్ ఖన్నా విరుచుకు పడ్డాడు. 




Updated Date - 2022-10-06T01:53:42+05:30 IST