ఆదిపురుష్ దర్శకుడికి కొత్త 'Shaktimaan'?

ABN , First Publish Date - 2022-07-10T21:47:41+05:30 IST

దేశీ సూపర్ హీరో అంటే అందరికి వెంటనే గుర్తుకొచ్చే పేరు ‘శక్తిమాన్’ (Shaktimaan). డీడీ నేషనల్‌లో ‘శక్తిమాన్’ సీరియల్‌గా ప్రసారమయ్యి అభిమానులను విపరీతంగా అలరించింది. ముఖేశ్ ఖన్నా(Mukesh

ఆదిపురుష్ దర్శకుడికి కొత్త 'Shaktimaan'?

దేశీ సూపర్ హీరో అంటే అందరికి వెంటనే గుర్తుకొచ్చే పేరు ‘శక్తిమాన్’ (Shaktimaan). డీడీ నేషనల్‌లో ‘శక్తిమాన్’ సీరియల్‌గా ప్రసారమయ్యి అభిమానులను విపరీతంగా అలరించింది. ముఖేశ్ ఖన్నా(Mukesh Khanna) ఈ సీరియల్‌లో శక్తిమాన్‌గా నటించాడు. ఈ షో 1997నుంచి 2005వరకు ప్రసారమయింది. ‘శక్తిమాన్’ ను సినిమాగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్‌తో కలసి భీష్మ్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మూడు భాగాలుగా రూపొందించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. మార్వెల్ కామిక్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ‘శక్తిమాన్’ ను రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తామని ముఖేశ్ ఖన్నా గతంలోనే తెలిపాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మేకర్స్ ఇప్పటికే ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించాలని ఓ స్టార్ డైరెక్టర్‌ను మేకర్స్ సంప్రందించారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. 


‘శక్తిమాన్’ కు దర్శకత్వం వహించాలని మేకర్స్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut)ను సంప్రదించారని తెలుస్తోంది. ఓం గతంలో ‘తాన్హాజీ: ది అన్‌సగ్ వారియర్’ (Tanhaji: The Unsung Warrior)కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించుకుని బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాడు. ‘శక్తిమాన్’లో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్నాయి. అందువల్ల అతడిని మేకర్స్ సంప్రదించారని సమాచారం. ‘శక్తిమాన్’ పాత్ర కోసం మేకర్స్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ను సంప్రదించారు. అందుకు రణ్‌వీర్ కూడా ఆసక్తి కనబరిచినట్టు బీ టౌన్‌లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. కానీ, తన అంగీకారం మాత్రం తెలపలేదు. ఓం రౌత్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ (Adipurush) కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

Updated Date - 2022-07-10T21:47:41+05:30 IST