శాకిని... డాకిని తయార్‌!

ABN , First Publish Date - 2022-08-17T07:01:46+05:30 IST

రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘శాకిని డాకిని’. కొరియన్‌ చిత్రం ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కి అధికారిక రీమేక్‌ ఇది...

శాకిని... డాకిని తయార్‌!

రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘శాకిని డాకిని’. కొరియన్‌ చిత్రం ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కి అధికారిక రీమేక్‌ ఇది. సుధీర్‌ వర్మ దర్శకుడు. డి.సురేశ్‌ బాబు, సునీత తాటి, థామస్‌ కిమ్‌ నిర్మాతలు. సెప్టెంబరు 16న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ని ఆవిష్కరించింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌ యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న కథ. అందుకే తెలుగులో రీమేక్‌ చేస్తున్నాం. రెజీనా, నివేదాల నటన పోటాపోటీగా సాగుతుంది. ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా ఉంటుంద’’న్నారు. సంగీతం: మైకీ మెక్‌ క్లియరీ, నరేశ్‌ కుమారన్‌.

Updated Date - 2022-08-17T07:01:46+05:30 IST