ఈ ‘కార్పోరేటర్’కి లైన్ క్లియర్

ABN , First Publish Date - 2021-11-23T21:58:44+05:30 IST

స్టార్ కమెడియన్ షకలక శంకర్ ‘కార్పోరేటర్’గా వచ్చేందుకు లైన్ క్లియరైంది. సమీప మూవీస్ బ్యానర్‌పై సంజయ్ పూనూరి దర్శకత్వంలో షకలక శంకర్, సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం

ఈ ‘కార్పోరేటర్’కి లైన్ క్లియర్

స్టార్ కమెడియన్ షకలక శంకర్ ‘కార్పోరేటర్’గా వచ్చేందుకు లైన్ క్లియరైంది. సమీప మూవీస్ బ్యానర్‌పై సంజయ్ పూనూరి దర్శకత్వంలో షకలక శంకర్, సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కార్పోరేటర్’. ఈ చిత్రం నవంబర్ 26న దాదాపు 200కి పైగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో 5 పాటలు, 4 ఫైట్స్ ఉంటాయని, వినోదానికి పెద్ద పీట వేస్తూ.. అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, షకలక శంకర్ నటన ఈ చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని చిత్ర దర్శకుడు డాక్టర్ సంజయ్ తెలిపారు. ఎం.ఎల్.పి. రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డాక్టర్ ఎస్. వి. మాధురి నిర్మించారు.  

Updated Date - 2021-11-23T21:58:44+05:30 IST