బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న షారూక్ కూతురు, బిగ్ బీ మనవడు..?

ABN , First Publish Date - 2022-02-07T20:29:12+05:30 IST

షారూక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోందా

బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న షారూక్ కూతురు, బిగ్ బీ మనవడు..?

షారూక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోందా.. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అరంగ్రేటం చేయబోతోందా.. స్టార్ డైరెక్టర్ జోయా అక్తర్ తెరకెక్కించబోయే చిత్రంలో కనిపించ‌బోతోందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా సుహానా ఖాన్ బాలీవుడ్ దర్శకురాలైన జోయా అక్తర్ ఆఫీస్‌కు వెళ్లింది. సినిమాకు సంబంధించిన చర్చలు జరపడం కోసమే జోయా కార్యాలయాన్ని సందర్శించిందని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ టాపిక్ బాలీవుడ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. జోయా కార్యాలయాన్ని సుహానా సందర్శించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన కూతురు హీరోయిన్ కావాలనుకుంటోందని గతంలోనే కింగ్ ఖాన్ చెప్పిన సంగతి తెలిసిందే.  


అయితే, ఈ చిత్రంలో సుహానా ఖాన్‌తో పాటు శ్రీదేవి కూతురు ఖుషి కపూర్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద కూడా కనిపించబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ‘అర్చీస్’ కామిక్స్‌ను రీమేక్ చేస్తున్నామని గతంలోనే జోయా అక్తర్ తెలిపింది. భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేస్తామని పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్ కోసం ఈ షోకు తానే దర్శకత్వం వహించబోతున్నానని వెల్లడించింది.



Updated Date - 2022-02-07T20:29:12+05:30 IST