‘‘జీవితం తిరిగొచ్చేది కాదు...’’ అంటూ ఆకాశంలో విహరిస్తోన్న బాలీవుడ్ STAR WIFE...

ABN , First Publish Date - 2022-05-02T21:57:25+05:30 IST

క్రేజీ పనులు చేయటానికి ఏజీతో సంబంధం ఉందంటారా? అస్సలు లేదంటోంది శ్రీమతి షాహిద్ కపూర్! అవును, మిసెస్ మీరా ఆకాశంలో తేలిపోయింది! దుబాయ్ లో సాహసాలు చేస్తూ ‘‘జీవితం తిరిగొచ్చేది కాదు...’’ అని గుర్తు చేస్తోంది!

‘‘జీవితం తిరిగొచ్చేది కాదు...’’ అంటూ ఆకాశంలో విహరిస్తోన్న బాలీవుడ్ STAR WIFE...

క్రేజీ పనులు చేయటానికి ఏజీతో సంబంధం ఉందంటారా? అస్సలు లేదంటోంది శ్రీమతి షాహిద్ కపూర్! అవును, మిసెస్ మీరా ఆకాశంలో తేలిపోయింది! దుబాయ్ లో సాహసాలు చేస్తూ ‘‘జీవితం తిరిగొచ్చేది కాదు...’’ అని గుర్తు చేస్తోంది!


షాహిద్ భార్య మీరా రాజ్ పుత్ దుబాయ్ కి వెళ్లింది. అయితే, ఇద్దరు పిల్లలు, భర్తతో కలసి కాదు. తన ఇద్దరు కాలేజ్ డేస్ ఫ్రెండ్స్ తో కలసి. అంతే కాదు, తన ఆల్ గాళ్స్ దుబాయ్ ట్రిప్ విషయాలు, విశేషాలు ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది కూడా. 


మీరా రాజ్ పుత్ తన లెటెస్ట్ దుబాయ్ వెకేషన్ పోస్టులో స్కై డైవింగ్ చేసింది. ఆకాశంలో తేలిపోతూ ఆనందంతో ముఖం వెలిగిపోతుండగా... జీవిత కాలానికి సరిపడా అనుభూతుల్ని స్వంతం చేసుకుంది. అందుకే, స్కై డైవింగ్ పిక్స్ తో పాటూ ‘‘జిందగీ నా మిలేగీ దొబారా’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది! తన కోరికల చిట్టాలో మరోకటి తీరిపోయిందంటూ సంతోషం వ్యక్తం చేసింది... 


దుబాయ్ లో తెగ ఎంజాయ్ చేస్తోన్న మీరా రాజ్ పుత్ ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేసింది. బుర్జ్ ఖలీఫా వద్ద, బుర్జ్ అల్ అరబ్ హోటల్ లోనూ ఆమె సందడి చేసింది. ‘కాలేజీ రోజుల్నుంచీ మేం ఫ్రెండ్స్...’’ అంటూ మీరా మరో వీడియోలో స్విమ్మింగ్ ఫుల్ జోష్ ప్రదర్శించింది. తన ఇద్దరు బెస్టీస్ తో కలసి ఆమె జలకాలాడుతూ కూల్ వైబ్స్ ని నెటిజన్స్ తో పంచుకుంది... 



Updated Date - 2022-05-02T21:57:25+05:30 IST