KGF 2 effect: వెనక్కి తగ్గిన షాహిద్‌కపూర్.. ‘జేర్సీ’ విడుదల వాయిదా..

ABN , First Publish Date - 2022-04-11T17:55:55+05:30 IST

బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ నటించిన చిత్రం ‘జేర్సీ’ విడుదల వాయిదా పడింది. ఈ మూవీ ఏప్రిల్ 14న థియేటర్స్‌లో..

KGF 2 effect: వెనక్కి తగ్గిన షాహిద్‌కపూర్.. ‘జేర్సీ’ విడుదల వాయిదా..

బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ నటించిన చిత్రం ‘జేర్సీ’ విడుదల వాయిదా పడింది. ఈ మూవీ ఏప్రిల్ 14న థియేటర్స్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే అదే రోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాన్ ఇండియా మూవీ సీక్వెల్ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ కూడా విడుదల కానుంది. అయితే యశ్ హీరోగా నటించిన ఈ మూవీ మొదటి భాగం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించింది. దీంతో ఈ సినిమా రెండో భాగం మీద కూడా దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అంతేకాకుండా ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సైతం రికార్డు స్థాయిలో వ్యూస్‌ని సొంతం చేసుకుంది.


దీంతో ‘కేజీఎఫ్’తో పాటు విడుదల చేస్తే ‘జేర్సీ’ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన మూవీ టీం.. ఈ చిత్ర విడుదలని ఏప్రిల్ 22కి వాయిదా వేసింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్‌లో తెలియజేశాడు. అందులో... ‘బ్రేకింగ్ న్యూస్.. జేర్సీ ఒక వారం వాయిదా పడింది. అంటే ఏప్రిల్ 22న థియేటర్స్‌లోకి రానుంది. గత రాత్రి మూవీ టీం ఈ నిర్ణయాన్ని తీసుకుంది’ అంటూ రాసుకొచ్చాడు. కాగా.. టాలీవుడ్ యువ నటుడు నాని నటించిన ‘జేర్సీ’కి రిమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు, ఎస్ నాగవంశీ, అమన్ గిల్ నిర్మిస్తున్నారు.



Updated Date - 2022-04-11T17:55:55+05:30 IST