Shahid Kapoor: ఆ సినిమా నాకో పాఠం నేర్పింది

ABN , First Publish Date - 2022-06-05T17:34:33+05:30 IST

బాలీవుడ్‌లోని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ నటుల్లో షాహిద్ కపూర్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న...

Shahid Kapoor: ఆ సినిమా నాకో పాఠం నేర్పింది

బాలీవుడ్‌లోని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ నటుల్లో షాహిద్ కపూర్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటుడు టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి(Arjun Reddy)’ రిమేక్ ‘కబీర్ సింగ్ (Kabir Singh)’తో మంచి హిట్ కొట్టాడు. అదే జోష్‌తో మరో టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జెర్సీ (Jersey)’ని అదే పేరుతో హిందీలో రిమేక్ చేశాడు. అయితే.. ఈ సారి ఫలితం మాత్రం తేడా కొట్టింది. కానీ.. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. సినిమా కమర్షియల్‌గా కలెక్షన్లు సాధించగా పోయినప్పటికీ మూవీకి, షాహిద్‌తో పాటు ఆ చిత్రంలోని ఇతర నటీనటుల నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఈ తరుణంలో ఈ సినిమా రిజల్ట్ గురించి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


షాహిద్ మాట్లాడుతూ.. ‘‘నా హృదయానికి దగ్గరైన సినిమా ‘జెర్సీ’. చూసిన ప్రేక్షకులు ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. కానీ.. కోవిడ్ 19 కారణంగా ఈ మూవీ విడుదల రెండు సంవత్సరాలు ఆలస్యం అయ్యింది. దీంతో ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చి ఉండొచ్చు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ సినిమా నా గుండెల్లోనే ఉంటుంది. అయితే జీవితంలో ఏదైనా జరగొచ్చనే పాఠాన్ని మాత్రం ఈ మూవీ నుంచి నేర్చుకోగలిగాను’ అని చెప్పుకొచ్చాడు.


కాగా.. షాహిద్ ప్రస్తుతం దర్శక ద్వయం, రచయితలు, ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ ఫేమ్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే నిర్మిస్తున్న కొత్త వెబ్‌సిరీస్ ఫర్జీతో ఓటీటీలోని రంగప్రవేశం చేయనున్నాడు. ఈ వెబ్ షోలో వివిధ సినీ పరిశ్రమలకు చెందిన విజయ్ సేతుపతి, అమోల్ పాలేకర్, రెజీనా కసాండ్రా, రాశి ఖన్నా, కే కే మీనన్, జాకీర్ హుస్సేన్, కుబ్రా సైత్, భువన్ అరోరా వంటి పాపులర్‌ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు.

Updated Date - 2022-06-05T17:34:33+05:30 IST