Shahid Kapoor: మళ్లీ ఇంటివాడైన బాలీవుడ్ హీరో

ABN , First Publish Date - 2022-09-29T01:58:43+05:30 IST

సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor). ఫస్ట్ మూవీ ‘ఇష్క్‌విష్క్’ తోనే బంపర్ హిట్ కొట్టాడు.

Shahid Kapoor: మళ్లీ ఇంటివాడైన బాలీవుడ్ హీరో

సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor). ఫస్ట్ మూవీ ‘ఇష్క్‌ విష్క్’ తోనే బంపర్ హిట్ కొట్టాడు. ‘జబ్ వి మెట్’, ‘హైదర్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి సినిమాలతో తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. బీ టౌన్‌లో షాహిద్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా షాహిద్‌కు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తుంది. ప్రస్తుతం ఉంటున్న ఇంటి నుంచి అతడు వేరే అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడని బీ టౌన్ మీడియా తెలుపుతోంది.      


షాహిద్ కపూర్, మిరా రాజ్‌ఫుత్ (Mira Rajput) బీచ్ సమీపాన జుహులోని అపార్ట్‌మెంట్‌లో నివసించేవారు. ప్రస్తుతం ఆ ఇంటిని ఖాళీ చేసినట్టు తెలుస్తోంది. వర్లీలోని మరో అపార్ట్‌మెంట్‌కు మారినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. షాహిద్, మిరా ఈ అపార్ట్‌మెంట్‌ను 2018లోనే కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ అపార్ట్‌మెంట్ కొనుగోలుకు రూ.58కోట్లను వెచ్చించారు. ఐదు రోజుల క్రితమే కొత్త అపార్ట్‌మెంట్‌కు వీరు మారినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే కొత్త అపార్ట్‌మెంట్‌లో పూజలు నిర్వహించారట. కొత్త ఇంటి ఇంటిరీయర్స్‌ను కూడా తమ అభిరుచులకు తగినట్టుగా డిజైన్ చేయించుకున్నారట. ఈ కొత్త అపార్ట్‌మెంట్‌ను కొన్నందుకు షాహిద్‌కు ఆరు పార్కింగ్ స్థలాలు లభించాయట. షాహిద్‌కు బాల్కనీలంటే చాలా ఇష్టం. అందువల్ల వర్లీలోని ఇంటిలో కూడా విశాలమైన బాల్కనీని డిజైన్ చేయించుకున్నాడని సమాచారం. షాహిద్, మిరా దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. జుహు అపార్ట్‌మెంట్ బీచ్ పక్కన ఉండటంతో భారీగా జనం గూమికూడుతున్నారు. షాహిద్ తన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను సిరీయస్‌గా తీసుకున్నాడట. జనసమూహానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. అందువల్ల కొత్త అపార్ట్‌మెంట్‌కు మారాడని తెలుస్తోంది. ఇక షాహిద్ కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)ని ‘కబీర్ సింగ్’ (Kabir Singh) టైటిల్‌తో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టాడు. అదే జోష్‌తో మరో టాలీవుడ్ మూవీ ‘జెర్సీ (Jersey)’ని అదే పేరుతో హిందీలో రిమేక్ చేశాడు. కానీ, ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది.

Updated Date - 2022-09-29T01:58:43+05:30 IST