నా భార్యకి పెళ్లైపోయిందంటూ... సాక్ష్యం చూపిన బాలీవుడ్ స్టార్ హీరో!

ABN , First Publish Date - 2022-03-27T00:30:18+05:30 IST

భార్యాభర్తల సరసానికి ఏదీ అడ్డు కాదు. సొషల్ మీడియా కూడా ఇందుకు మినహాయింపు కాదు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, ఆయన భార్య మీరా రాజ్‌పుత్ అదే నిరూపిస్తున్నారు. గతంలోనూ చాలా సార్లు ఒకర్నొకరు సొషల్ మీడియాలో ఆటపట్టించుకున్న ఈ ఆలుమగలు... మరోసారి మాటలు సంధించకున్నారు. కవ్వింపు మాత్రం మొదట ‘కబీర్ సింగ్’ మొదలెట్టాడు...

నా భార్యకి పెళ్లైపోయిందంటూ... సాక్ష్యం చూపిన బాలీవుడ్ స్టార్ హీరో!

భార్యాభర్తల సరసానికి ఏదీ అడ్డు కాదు. సొషల్ మీడియా కూడా ఇందుకు మినహాయింపు కాదు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, ఆయన భార్య మీరా రాజ్‌పుత్ అదే నిరూపిస్తున్నారు. గతంలోనూ చాలా సార్లు ఒకర్నొకరు సొషల్ మీడియాలో ఆటపట్టించుకున్న ఈ ఆలుమగలు... మరోసారి మాటలు సంధించకున్నారు. కవ్వింపు మాత్రం మొదట ‘కబీర్ సింగ్’ మొదలెట్టాడు... 


షాహిద్ కపూర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో మిష్టర్ అండ్ మిసెస్ షాహిద్ ఇద్దరూ కార్లో కనిపించారు. అయితే, బీ-టౌన్ అందగాడు సెల్ఫీ వీడియో తీస్తుండగా మేడమ్‌గారు మాత్రం ఫోన్‌లో మునిగిపోయారు. మొబైల్ చూస్తూ మొదట్లో షాహిద్ వీడియో తీస్తుండటాన్ని అసలు పట్టించుకోనే లేదు. చివర్లో మాత్రం చిన్న స్మైల్ ఇస్తుంది మీరా రాజ్‌పుత్. అయితే, ఈ సెల్ఫీ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన షాహిద్ కపూర్ ‘‘మ్యారీడ్ టూ ద ఫోన్’’ అని భార్యని ఉద్దేశించి కామెంట్ చేశాడు. మీరా ఊరుకుంటుందా చెప్పండి? తన పెళ్లి ఫోన్‌తో అయిపోయిందన్న భర్తకి అంతే ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ‘‘గెట్ మ్యారీడ్ టూ ద కౌచ్ నౌ...’’ అంది!


తన భార్యకి ఫోన్‌తో పెళ్లైందని షాహిద్ చమత్కరిస్తే... వెళ్లి మంచాన్ని పెళ్లి చేసుకోమంటూ మిసెస్ మీరా చెప్పటం నెటిజన్స్‌లో చాలా మందిని ఆకట్టుకుంది. కొందరు తాము కూడా ఫన్నీ కామెంట్స్ చేశారు. భార్య ఫోన్‌ని పెళ్లాడిందని షాహిద్ చెబుతోంది కూడా ‘ఫోన్’ ద్వారానే అంటూ పాయింట్ అవుట్ చేశారు ఓ నెటిజన్! మరో వ్యక్తి ‘‘ప్రతీ భర్త తాలూకూ సమస్య’’ అన్నారు!   



Updated Date - 2022-03-27T00:30:18+05:30 IST